Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి సలహాలు చాలా విలువైనవి.. ఫాలో అయితే విజయం మీవెంటే!
సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. చాలా తెలివిగా ఉంటారు. జరగబోయేవి కూడా ముందే ఊహించగలుగుతారు. సన్నిహితులకు కూడా మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. వారి సలహాలు పాటిస్తే జీవితం బాగుంటుందట. మరి ఆ తేదీలెంటో ఓసారి చూసేద్దామా?

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ, టైం ద్వారా వ్యక్తుల జీవితం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. తేదీని బట్టి వారి ప్రవర్తన, వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. తెలివిగా ఉంటారు. గొప్పగా ఆలోచిస్తారు. జరగబోయేవి కూడా ముందే ఊహించే ప్రయత్నం చేస్తారు. తోటివారికి కూడా సరైన సలహాలు, సూచనలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి సూచనలను నిర్లక్ష్యం చేస్తే నష్టాలు తప్పవట. ఏయే తేదీల్లో పుట్టిన వారి మాట కచ్చితంగా వినాలో ఇక్కడ తెలుసుకుందాం.
తెలివైనవారు...
సంఖ్యాశాస్త్రం ప్రకారం 3, 6, 5, 11, 12, 15, 21, 24, 29, 30 తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైనవారు. ముందు చూపుతో ఉంటారు. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. సాయం చేయడంలో ముందుంటారు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారు చెప్పే మాటలను, సలహాలను గౌరవించడం, పాటించడం మంచిది. లేదంటే నష్టపోక తప్పదు.
బాగా మాట్లాడతారు
సంఖ్యా శాస్త్రం ప్రకారం 5, 23 తేదీల్లో పుట్టిన వారు చాలా బాగా మాట్లాడుతారు. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ. ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. ఎంత కష్టమైన ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు వీరికి ఉంటాయి. కాబట్టి అలాంటి వారు పక్కన ఉంటే మీ కష్టకాలంలో ధైర్యంగా ఉండవచ్చు. సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఓపిక ఎక్కువ
న్యూమరాలజీ ప్రకారం 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు చాలా ఓపికగా ఉంటారు. చాలా దయగా ఉంటారు. చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ సమస్యనైనా ఈజీగా పరిష్కరించగలరు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారికి దూరంగా ఉంటే కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలి.
లోతైన దృష్టి
సంఖ్యాశాస్త్రం ప్రకారం 11, 29 తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివిగా ఉంటారు. చాలా లోతైన, దూర దృష్టి కలిగి ఉంటారు. వీరు చెప్పే సలహా అస్సలు విస్మరించవద్దని సంఖ్యా శాస్త్రం చెబుతోంది
క్రియేటివిటీ
న్యూమరాలజీ ప్రకారం 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు సహజంగానే చాలా క్రియేటివ్ గా ఉంటారు. వీరిచ్చే సలహా నిజాయితీగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు.