November 2025: నవంబర్ లో ఈ ఐదు రాశులకు డబ్బుకు లోటు ఉండదు, ఆ అదృష్ట రాశులు ఇవే
November 2025:నవంబర్ నెల శుక్రుని సంచారంతో ప్రారంభమౌతుంది. శుక్రుడు తుల రాశిలో సూర్యుడితో కలిసి ఉంటాడు. దీని వల్ల శుక్ర రాజాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులకు సంపాదన పెరుగుతుంది. వారి అదృష్టం రెండింతలు పెరుగుతుంది. ఆ రాశులేంటో చూద్దాం

కర్కాటక రాశి...
నవంబర్ నెల కర్కాటక రాశివారికి అద్భుతంగా కలిసి రానుంది. ఈ నెల ఈ రాశివారు మంచి లాభాలు పొందగలరు. అందువల్ల, మీ ఆదాయం ఇతర నెలలతో పోలిస్తే రెట్టింపు అవుతుంది. అదనపు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మీరు కోరుకున్న విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు విజయాలను అందుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ మీకు సపోర్ట్ దొరుకుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ప్రియమైన వారితో ఎక్కువ సమయం ఆనందంగా గడుపుతారు.
2.సింహ రాశి...
నవంబర్ నెల సింహ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. విజయాలు కూడా అందుకుంటారు. కెరీర్ కోరుకున్న స్థాయికి వెళుతుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. కోరుకున్న విజయం సాధిస్తారు. మీరు అనుకున్న పనులన్నీ సులభంగా, ఉత్సాహంగా పూర్తి చేయగలరు. ఈ నెలలో ఇంట్లో , కార్యాలయంలో అందరి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రాశికి చెందిన మహిళలు గణనీయమైన విజయం అందుకుంటారు. వివాహ జీవితం ఆనందంగా మారుతుంది.
3.వృశ్చిక రాశి....
నవంబర్ నెలలో వృశ్చిక రాశివారు వారి ఆరోగ్యం, సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో ఈ రాశివారి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. చిన్న చిన్నవి ఏవైనా వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. బడ్జెట్ బాగుంటుంది. చేతికి డబ్బులు బాగా అందుతాయి.
4.ధనస్సు రాశి...
నవంబర్ నెల ధనుస్సు రాశి వారికి అవకాశాలు పెరుగుతాయి. మీరు కోరుకుంటే, ప్రతి ప్రతికూలతను అవకాశంగా మార్చడానికి మీరు మీ తెలివితేటలను ఉపయోగించుకుంటారు. నెల ప్రారంభంలో, మీరు మంచి కెరీర్ , వ్యాపార అవకాశాలను పొందుతారు. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీ కోరిక నెరవేరుతుంది. మీ కెరీర్ పరంగా, మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పాల్గొన్న వారు తమ ప్రత్యర్థుల నుండి పోటీని ఎదుర్కోవలసి రావచ్చు, కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
5.వృషభ రాశి....
నవంబర్ నెల వృషభ రాశి వారికి బాగా కలిసొస్తుంది. ఈ నెలలో మీరు మీ పిల్లలకు సంబంధించిన విషయాల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. అయితే, నెల గడిచేకొద్దీ, ఈ సమయం మీకు చాలా అదృష్టంగా మారుతుంది. ఈ నెల రెండవ భాగంలో కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఈ నెలలో ఎక్కువ లాభాలు పొందుతారు.