Makara rasi 2024: న్యూ ఇయర్ లో మకర రాశి వారికి ఎలా ఉండనుుందంటే..!
2024 లో మకర రాశివారికి ఇలా ఉండనుంది. ఈ రాశివారికి ఈ ఏడాది మీకు ,మీ కుటుంబసభ్యుల సహకారం అన్ని విధాలా ఉంటుంది.
capricorn
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
మకరం రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం
horoscope today Capricorn
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు చతుర్ధ స్థానంలో సంచరించి మే నెల నుండి పంచమ లో సంచారము.
శని:- ఈ సంవత్సరమంతా ధన స్థానంలో సంచారము.
రాహు:-ఈ సంవత్సరమంతా తృతీయ స్థానంలో సంచారము.
కేతు:-ఈ సంవత్సరమంతా భాగ్య స్థానంలో సంచారము.
horoscope today Capricorn
ఈ సంవత్సరంలో మీకు ,మీ కుటుంబసభ్యుల సహకారం అన్ని విధాలా ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో మంచి చేకూరుతుంది. అలాగే ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనః పీడ పెరుగుతుంది. పంచముఖి ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.. ఏప్రిల్ 22వరకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఏప్రిల్ 23 నుంచి అదృష్ట యోగం. కేతు సంచారంవల్ల మానసిక సమస్యలు రాకుండా కేతు శ్లోకం చదువుకోవాలి.
ఇక సంవత్సరం మధ్యంలో అంటే ఆగస్టు నుంచి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కష్టపడి పనిచేయాలి. అదృష్టయోగం బాగుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. వ్యాపారంలో ఎదుగుతారు. గృహ భూవాహన యోగాలు సిద్ధిస్తాయి. విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి
రాజకీయవేత్తలు, పారిశ్రామికరంగం వారి చిరకాల కోరిక నెరవేరవచ్చు. అయితే ప్రధమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వివాహాది శుభకార్యాలు ద్వితీయార్థంలో కలసివస్తాయి. వ్యవసాయదారులు మునుపటి కంటే లాభపడతారు. వైద్యులు, సాంకేతిక రంగంలోని వారిలో మరింత భరోసా ఏర్పడుతుంది. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు కలిసివచ్చేవి. మిగతావి సామాన్యం. వీరు అక్టోబర్వరకూ రాహు, కేతువులకు జపాలు వంటి పరిహారాలు చేయాలి. అలాగే, దుర్గామాతకు ఎక్కువగా పూజాదికాలు నిర్వహించాలి.
నవంబర్ నుంచి బ్రహ్మాండమైన ఆర్థికస్థితి గోచరిస్తోంది. అదృష్టయోగం. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. విద్యార్థులు రాణిస్తారు. అయితే ఉద్యోగంలో పూర్వార్థం బాగుంటుంది. తర్వాత గురుబలం లేనందున ఏకాగ్రతతో పనిచేయాలి. పనులు వాయిదా వేయవద్దు. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి.వ్యాపారం బాగుంటుంది. పెట్టుబడులు వృద్ధిచెందుతాయి. అవివాహితులకు వివాహయోగం. కొన్ని కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో జతకడతారు. లాభనష్టాలు సమతూకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు విశేష గుర్తింపు లభిస్తుంది. వీరికి పదోన్నతులు లభించవచ్చు. పారిశ్రామిక, శాస్త్రవేత్తలకు శుభదాయకమైన కాలం. కళాకారులకు మరిన్ని అవకాశాలు అవలీలగా దక్కుతాయి. అయితే పర్వ దినాల్లో శనీశ్వరునికి, మంచి రోజుల్లో రాహుకేతువులకు పరిహారాలు చేయించాలి.