Zodiac Signs: ఈ రాశులవారిని నమ్మితే.. మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు..!
నమ్మకం లేకుండా.. ఏ బంధం నిలపడదు. ఎదుటి వ్యక్తిని నమ్మడం చాలా అవసరం. కానీ, కొందరి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. కొందరిని నమ్మితే జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది.

జీవితంలో మనకు చాలా మంది పరిచయం అవుతారు. వారిలో కొందరు మాత్రమే మనకు దగ్గరౌతారు. కొందరు ఆప్తమిత్రులు అవుతారు.మనకు దగ్గరైన వారిని దాదాపు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. ఎందుకంటే.. ప్రతి బంధంలో నమ్మకం చాలా అవసరం. నమ్మకం లేకుండా.. ఏ బంధం నిలపడదు. ఎదుటి వ్యక్తిని నమ్మడం చాలా అవసరం. కానీ, కొందరి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. కొందరిని నమ్మితే జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. కొందరు నిజాయితీగా ఉంటే, కొందరు అబద్దాలతో మోసం చేస్తారు. ముఖ్యంగా జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిని మాత్రం అస్సలు నమ్మకూడదు.వారు ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా..
1.మేష రాశి, వృశ్చిక రాశి..
మేష రాశి, వృశ్చిక రాశి వారు ఇతరులను మోసం చేయాలనే భావనతో ఉండరు. ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. ఏ విషయంలో అయినా వీరు చాలా సూటిగా ఉంటారు. అబద్ధాలకు దూరంగా ఉంటారు. ఎప్పుడైనా అబద్ధం చెప్పాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడి.. అబద్ధం చెప్పినా.. వెంటనే దొరికేస్తారు. వారు చెప్పింది అబద్ధం అని అందరికీ తెలిసిపోతుంది.
2.సింహ రాశి, తుల రాశి, మీన రాశి..
జోతిష్య శాస్త్రంలో సింహ రాశి, తుల రాశి, మీన రాశి వారికి అబద్ధాలు చెప్పే అలవాటు పుట్టుకతోనే ఉంటుంది. చేసిన తప్పు నుంచి తప్పుకోవడానికి చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ తాము లైమ్ లైట్ లో ఉండటానికి ఇష్టపడతారు. అందరూ తమ గురించి మాట్లాడుకోవాలని, తమను పొగడాలని అనుకుంటూ ఉంటారు. దాని కోసం అబద్ధాలు చెబుతారు. కానీ, ఇతరులకు హాని కలిగించేలా మాత్రం చెప్పరు.
3.కర్కాటక రాశి, కుంభ రాశి..
కర్కాటక రాశి , కుంభ రాశివారు మోసం చేయడంలో ముందు వరసలో ఉంటారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అబద్ధాలు చెప్పడం వీరికి మాత్రమే సాధ్యం. ఈ రాశివారు చాలా తెలివైన వారు. తమ తెలివి తేటలతో, మాటలతో మాయ చేసి, ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.అప్పటి కప్పుడు కల్పిత కథలు అల్లి మరీ చెప్పేయగలరు.
మిథునం, ధనుస్సు , మకరం..
మిథునం, ధనస్సు, మకర రాశివారు మనకు అబద్ధాలు చెప్పనివారిలానే కనిపిస్తారు. కానీ, అవసరానికి తగినట్లు అబద్ధాలు చెబుతూనే ఉంటారు. వీరు ఎప్పుడూ స్వీయ రక్షణకు ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. తమ కోసం ఎన్ని అబద్ధాలు చెప్పడానికి అయినా వెనకాడరు. అయితే.. ఇతరుల భావాలను కాయపరచకుండా సత్యాన్ని వక్రీకరించి చెబుతారు. ఈ రాశుల వారు మోసం చేసినా తాము చేసిన పనిని తాము సమర్థించుకుంటారు.
వృషభ రాశి, కన్య రాశి...
వృషభ రాశి, కన్య రాశి వారు కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు.ఈ రాశివారు కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు. అయితే.. తాము చెప్పే అబద్ధాలు మంచి కోసమే అని సమర్థించుకుంటారు. సమస్యలను తగ్గించడానికి మాత్రమే అబద్ధం చెబుతున్నాం అంటారు. కానీ, వాటి కారణంగా మోసపోయేవారు కూడా చాలా మంది ఉంటారు.