- Home
- Astrology
- Mutton In Dream: కలలో మటన్ కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా.? జాగ్రత్తగా ఉండాల్సిందే
Mutton In Dream: కలలో మటన్ కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా.? జాగ్రత్తగా ఉండాల్సిందే
Mutton In Dream: కలలు మన నియంత్రణలో ఉండవు. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన జీవితం లోని ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, సంబంధాలు, భవిష్యత్తు మార్పులకు సంకేతాలుగా భావిస్తారు. మరి కలలో మటన్ కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

కలలో వండిన మాంసం కనిపిస్తే..
కలలో మాంసాన్ని ఉడికిస్తున్నట్లు లేదా వండిన మాంసాన్ని చూసినట్లుగా కనిపిస్తే ఇది సాధారణంగా శుభ సూచనగా భావిస్తారు. ఇలాంటి కలలు జీవితంలో ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు పెరుగుతున్నాయన్న సంకేతంగా చెబుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి, వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే వండిన మాంసాన్ని తింటున్నట్లు కల వస్తే ముందున్న రోజుల్లో పురోగతి స్పష్టంగా కనిపిస్తుందని స్వప్నశాస్త్ర పండితుల అభిప్రాయం.
మాంసాన్ని కట్ చేస్తున్నట్లు కల వస్తే అర్థం
మీరు స్వయంగా మాంసాన్ని కోస్తున్నట్లు కలలో కనిపిస్తే అది ఆస్తి సంబంధిత లాభాలకు సూచనగా చెబుతారు. ముఖ్యంగా కుటుంబ పరంగా రావాల్సిన వారసత్వ ధనం లేదా భూములు మీకు దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తారు. కొన్ని సందర్భాల్లో విలువైన ఆస్తిని పంచుకునే పరిస్థితులు కూడా ఎదురయ్యే సూచనగా ఈ కలను వివరిస్తారు. మొత్తానికి ఇది ఆర్థిక లాభాల వైపే సంకేతం ఇస్తుందని చెప్పవచ్చు.
కలలో మాంసం తినడం మంచిదా? చెడ్డదా?
కలలో మాంసం తింటున్నట్లు కనిపిస్తే ఇది కొంత నెగిటివ్ సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా ఆత్మీయుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని స్వప్నశాస్త్రం చెబుతుంది. స్నేహితులతో దూరం ఏర్పడటం, మాటల వల్ల మనస్పర్థలు రావడం వంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనగా దీనిని తీసుకుంటారు. అయితే స్నేహితులతో కలిసి నాన్ వెజ్ తింటున్నట్లు కల వస్తే అది మాత్రం శుభ సూచికగా చెబుతారు. ఏదైనా కొత్త అవకాశం లేదా ముందడుగు వేసే పరిస్థితి వస్తుందని భావిస్తారు.
కుళ్లిన, పచ్చి మాంసం కలలో కనిపిస్తే
కుళ్లిన మాంసం కలలో కనిపిస్తే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికగా భావిస్తారు. శరీరంపై నిర్లక్ష్యం చేస్తే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అర్థం. పచ్చి లేదా వండని మాంసం కలలో కనిపిస్తే రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతుందని స్వప్నశాస్త్రం చెబుతుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక లాభాలు వెంటనే చేతికందకపోవచ్చు.
వివిధ రకాల మాంసాల కలలకు అర్థాలు
కలలో పంది మాంసం కనిపిస్తే అక్రమ మార్గాల ద్వారా డబ్బు వచ్చే పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్న సూచనగా భావిస్తారు. కోడి మాంసం తిన్నట్లు మహిళలకు కల వస్తే శుభవార్తలు వినే అవకాశం ఉందని చెబుతారు. పాము మాంసం కలలో కనిపిస్తే అది అశుభ సూచనగా పరిగణిస్తారు. ఇలా మాంసం రకం, పరిస్థితి, మీరు చేసిన చర్యల ఆధారంగా ఫలితాలు మారుతూ ఉంటాయని స్వప్నశాస్త్రం స్పష్టంగా చెబుతోంది.
గమనిక: కలలు ప్రతి ఒక్కరికీ వస్తాయి. వాటిని భయంతో కాకుండా అవగాహనతో చూడాలి. కలలో మాంసం కనిపించడం తప్పనిసరిగా మంచి లేదా చెడు మాత్రమే అన్న నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. అందులోనూ స్వప్న శాస్త్రానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉండవని గుర్తించాలి.

