ఈ రాశికి చెందిన తల్లులుల ప్రేమను పంచడంలో... ఎమోషనల్ సెక్యురిటీ ఇవ్వడంలో ది బెస్ట్...
పేరెంటింగ్ విషయానికి వస్తే, పిల్లలతో ఎమోషనల్ బాండింగ్ ఉండడం చాలా మంచిది. ఇది పిల్లల్ని చక్కటి వ్యక్తిత్వం గల మంచి పౌరులుగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఏదైనా శృతి మించితే ప్రమాదమే.. అతి ప్రేమ, అతి భావోద్వేగం పిల్లల్ని ఎదగకుండా చేస్తుంది.. వారిని మానసికంగా కట్టడి చేస్తాయి. అలాగని అంత ఎమోషనల్ గా ఉండడం తప్పు కాకపోయినా.. అవసరం లేదు.

మహిళలు భావోద్వాగానికి మూల స్తంభాలుగా కనిపిస్తారు. ఏ చిన్న విషయానికైనా ఈజీగా ఎమోషనల్ అవుతారు. పురుషులు శారీరకంగానే కాదు మానసికంగానూ ధృఢంగా ఉంటారు. ఇది సమాజంలో ఉన్న మూసధోరణి. అయితే భావోద్వేగానికి గురవ్వడానికి స్త్రీ, పురుషులు అనే తేడా ఉండదు.
ఇక పేరెంటింగ్ విషయానికి వస్తే, పిల్లలతో ఎమోషనల్ బాండింగ్ ఉండడం చాలా మంచిది. ఇది పిల్లల్ని చక్కటి వ్యక్తిత్వం గల మంచి పౌరులుగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఏదైనా శృతి మించితే ప్రమాదమే.. అతి ప్రేమ, అతి భావోద్వేగం పిల్లల్ని ఎదగకుండా చేస్తుంది.. వారిని మానసికంగా కట్టడి చేస్తాయి. అలాగని అంత ఎమోషనల్ గా ఉండడం తప్పు కాకపోయినా.. అవసరం లేదు.
ఇలా పిల్లల్ని అతి ప్రేమతో, తమ భావోద్వేగాలతో చెడగొట్టే తల్లులు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటారు. అయితే ఇది వారి తప్పు కాదట.. వారు జన్మించిన రాశి ప్రభావం అంటున్నారు జాతకనిపుణులు. అలాంటి ఐదు రాశుల చెబుతున్నారు.
Representative Image: Aries
మేషం (Aries)
మేషరాశి వారికి ఏ భావోద్వేగమైనా చాలా ఎక్కువ. తొందరగా అగ్గిమీద గుగ్గిలం అవుతారు. అయితే కోపం కూడా ఓ రకమైన భావోద్వేగమే అనేది మరిచిపోకూడదు. తొందరగా కోపం వస్తుంది. అందుకే మేషరాశి వారితో శత్రుత్వం పెట్టుకోకూడదు. వీరు ద్వేషిస్తే మామూలుగా ఉండదు. ఇక మేషరాశి తల్లులతో వేగడం చాలా కష్టం. వీరికి తొందరగా కోపం వస్తుంది. అంతేకాదు ఈ రాశిచక్రం గల తల్లులు అత్యంత ప్రేమగలవాళ్లు, రక్షిత వ్యక్తులలో ఒకరు.
Representative Image: Cancer zodiac
క్యాన్సర్ (Cancer)
కర్కాటకరాశివారు చంద్రునితో పాలించబడతారు. చంద్రుడు భావోద్వేగాలకు అధిపతి. కర్ణాటక రాశివారు తమ భావోద్వేగాలను ఈజీగా బయటపెడతారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే కోపం, ప్రేమలాంటి భావోద్వేగాలను ఎప్పుడూ దాచుకోరు.
సింహం (leo)
సింహరాశివారు ప్రాక్టికల్ గా ఉంటారు. బాగా అవుట్ గోయింగ్ పర్సన్స్. దీంతోపాటు బలమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. భావోద్వేగ పరంగా చూస్తే సింహరాశి వారు తీవ్రవాదులు. వారు తమ దగ్గరి వారి దగ్గరస్వేచ్ఛగా వ్యక్తీకరించబడే బలమైన, తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. పిల్లల విషయానికి వస్తే, సింహరాశి తల్లులు రక్షణ, ఆధిపత్యం చాలా భావోద్వేగం కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ దానిని చూపించకపోవచ్చు కానీ.. ఒక్కసారి చూపించారా.. భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
Representative Image: Scorpio
వృశ్చిక రాశి (Scorpio)
బైటికి కఠినంగా కనిపించే వృశ్చిక రాశి వారు లోపల చాలా సున్నితంగా ఉంటారు. వారు మానసికంగా చాలా ఎమోషనల్ గా ఉంటారు. అయితే వీరి భావోద్వేగం ఎప్పుడూ కఠినంగా, కోపోద్రిక్తులుగా, రాక్షసులుగా వీరిని చిత్రిస్తుంది. నిజం ఏమిటంటే, ఈ విపరీతమైన కోపానికి ఇంకో కోణం ఉంటుంది. వీరు చాలా ప్రేమతత్వం కలిగిన వారు. ఎంతో ప్రేమిస్తారు. ఏది చేసిన మనస్పూర్తిగా చేస్తారు. చాలా హృదయపూర్వకంగా భావోద్వేగంగా ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన తల్లులు మానసికంగా తెలివైన తల్లులుగా గుర్తింపు పొందారు.
Representative Image: Pisces
మీనం (Pisces)
అత్యంత భావోద్వేగ పరమైన రాశిచక్రాలలో మీనరాశి ఒకటి. ఇది ప్రధానంగా దయ, కరుణలకు ప్రసిద్ది చెందింది. పిల్లలతో వీరు చాలా ఎక్స్ ప్రెసివ్ గా, ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. మీనరాశి తల్లులు భావోద్వేగపరమైన వారు. పిల్లలకు ఎమోషనల్ సెక్యూరిటీని అందిస్తారు.