బుధ గోచార్: సింహ రాశిలోకి బుధుడు...ఈ 8 రాశుల వారికి చుక్కలే, కష్టాలు తప్పవు..!
గ్రహాలకు అధిపతి అయిన బుధుడు.. ఆగస్టు 30 వ తేదీ నుంచి సూర్య రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఈ బుధ గోచారం కారణంగా.. 8 రాశులకు ఊహించని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయం తగ్గనుంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బుధ సంచారం..
జోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాలకు అధిపతిగా పిలుస్తారు. ఈ రాశిచక్ర మార్పు ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 4: 48 గంటలకు జరగనుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు సొంత రాశి అయిన సింహ రాశిలోకి ఈ బుధ గ్రహం అడుగుపెట్టనుంది. దీని ప్రభావం.. 8 రాశులపై చాలా ఎక్కువగా చూపనుంది. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ రాశులపై నెగిటివ్ ప్రభావం చూపించనుంది. ఈ సమయంలో చాలా ఎక్కువ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు, కెరీర్, ఆరోగ్యం అన్నింట్లోనూ కష్టాలు తప్పేలా లేవు. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
1.మేష రాశి...
సింహ రాశిలోకి బుధుడు సంచరించడం వల్ల..మేష రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ 15 రోజులు కష్టాలు తప్పేలా లేదు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ, పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు ఏమీ చేపట్టకపోవడమే మంచిది. ఏదీ అనుకూలంగా ఉండదు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది.
2.వృషభ రాశి...
సింహ రాశిలో బుధ సంచారం వల్ల వృషభ రాశిలో జన్మించిన వారికి వ్యాపారంలో లాభం పొందడానికి, వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి, శాంతి, శ్రేయస్సు సాధించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ రాశివారి తల్లి ఆరోగ్యంలో సమస్యలు రావచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మీ సమస్యలను తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. అవి పరిష్కారం కావు. ఈ సమయంలో పెద్ద ప్రాజెక్టులకు దూరంగా ఉండటమే మంచిది.
3.కర్కాటక రాశి..
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు బుధుడు సింహరాశిలో సంచరించడం వల్ల పెద్దగా పురోగతి సాధించకపోవచ్చు. మీ వ్యక్తిత్వం కారణంగా సమస్యల్లో పడే అవకాశం ఉంది. ఈ బుధ సంచారము కారణంగా, కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు ఆర్థిక విషయాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీ కఠినమైన మాటలు కుటుంబ సభ్యులతో తగాదాలకు దారితీయవచ్చు. అనుకోని సమస్యలు స్వయంగా తెచ్చుకుంటారు.
4.కన్య రాశి..
సింహరాశిలో బుధుడు సంచరించడం వల్ల, కన్య రాశి వారికి వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో అభిప్రాయ బేధాలు రావచ్చు. ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. సింహరాశిలో బుధుడు ఈ సంచారము కారణంగా, మీరు మీ ఆరోగ్యం పరంగా ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపారంలో నష్టం జరిగే అవకాశం ఉంది. సంబంధాలలో చీలిక వచ్చే అవకాశం ఉంది. సింహరాశిలో బుధుడు సంచరించడం వల్ల, మీరు ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేయడం మంచిది. కాబట్టి, ఈ సమయంలో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది.
5.వృశ్చికరాశి
సింహరాశిలో బుధుడు సంచరించడం వల్ల, వృశ్చిక రాశి వ్యక్తులు వారి కెరీర్‌లో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. ఈ కాలంలో, మీరు మీ పనిని పూర్తి చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. మీ అహం కారణంగా వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక సమస్యలను మీరు ఎదుర్కొంటారు. సింహరాశిలో బుధుడు సంచరించడం వల్ల, ఆఫీసులో తప్పులు చేసే అవకాశం ఉంది. దీని కారణంగా, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. అలాగే, మీ వ్యక్తిత్వానికి సంబంధించి చాలా అపార్థాలు ఉండవచ్చు.
6.మకరరాశి
బుధుడు సంచరించడం వల్ల, మకరరాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో వాదనలు, వివాదాలు , ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. సింహరాశిలో బుధుడు సంచరించడం వల్ల, మీ వ్యక్తిత్వం , వ్యాపారానికి సంబంధించిన అనేక సవాళ్లను మీరు ఎదుర్కోవచ్చు. అదనంగా.. సమాజంలో మీ గౌరవం తగ్గిపోవచ్చు.
7.కుంభ రాశి..
బుధ సంచారం.. కుంభ రాశివారికి కూడా సమస్యలు తప్పవు. కెరీర్ లో ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, మీరు మీ కెరీర్‌లో బాగా రాణించలేకపోవచ్చు. సింహరాశిలో బుధ సంచారం.. మీరు మీ వృత్తిలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఓటమిని ఎదుర్కోవలసి రావచ్చు.
8.మీన రాశి...
సింహరాశిలో బుధ సంచారం, మీన రాశి వ్యక్తులు వారి వృత్తిలో పెద్దగా పురోగతి సాధించకపోవచ్చు. అలాగే, ఈ కాలంలో, మీరు చాలా సవాళ్లను ఎదుర్కుంటారు. మీ వ్యక్తిత్వంతో సంతోషంగా ఉండరు. సింహరాశిలో బుధ సంచారం.. కారణంగా ఈ రాశివారికి ఇతరులతో ఎక్కువగా గొడవలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఇతరులు ఈ రాశివారిని మోసం చేసే అవకాశం ఉంది.