నేడు ఈ రాశివారికి ఉద్యోగ అవకాశాలు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 4.12.2025 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. బంధువులతో చిన్న పాటి వివాదాలు తప్పవు. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
వృషభ రాశి ఫలాలు
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహన్నిస్తుంది.
మిథున రాశి ఫలాలు
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. చేతిలో డబ్బు లేక అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు మానసికంగా కలచివేస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.
కన్య రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమవుతాయి. ఇంటా బయటా నూతన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.
తుల రాశి ఫలాలు
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటా బయటా మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
ధనుస్సు రాశి ఫలాలు
ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకర రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనయోగం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహా సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీన రాశి ఫలాలు
ఉద్యోగాలలో ఊహించని ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు అంతంతా మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

