- Home
- Astrology
- Mercury Transit: విశాఖ నక్షత్రంలోకి బుధుడు.. ఈ రాశుల వారికి వ్యాపారంలో ఖజానా నిండిపోతుంది
Mercury Transit: విశాఖ నక్షత్రంలోకి బుధుడు.. ఈ రాశుల వారికి వ్యాపారంలో ఖజానా నిండిపోతుంది
Mercury Transit: బుధుడి నక్షత్ర మార్పు 12 రాశులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. బుధుడు నవంబర్ 21న విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారు లాభాలు పొందుతారు.

బుధుడి నక్షత్ర మార్పు
గ్రహాల్లో బుధుడు ఎంతో ముఖ్యమైనవాడు. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 21న బుధుడు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. విశాఖ నక్షత్రం అనేది గురు గ్రహానికి సంబంధించిన నక్షత్రం. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 9 వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. దీని వల్ల మూడు రాశుల వారికి భీభత్సంగా కలిసివస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.
మిథున రాశి
బుధుడు మిథున రాశికి అధిపతి. ఈ బుధ గోచారం అనేది మిథునరాశి వారికి శక్తివంతమైన ఫలితాలు ఇస్తాడు. ఈ రాశివారు చేసే వ్యాపారంలో పెరుగుదల కనిపిస్తుంది. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. కొత్త అవకాశాలు పెరుగుతాయి. విదేశాల నుంచి కూడా కొన్ని లాభాలు కలిగే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు విజయవంతం అవుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి బుధ గోచారం ఆర్థిక పరంగా చాలా కలిసివస్తుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టబడులు లాభాలు తెచ్చిపెడుతుంది. పనిలో మంచి గుర్తింపును పొందుతారు. వ్యాపారంలో వీరికి విజయాలు దక్కుతాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఇది గోల్డెన్ పీరియడ్ అనే చెప్పుకోవాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధ గోచారం అదృష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఎప్పట్నించో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మీ అప్పుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి విపరీతంగా కలిసివస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా జరుగుతాయి. కుటుంబంలో శాంతి, అనుకూలత ఏర్పడుతుంది. వారికి ఆర్ధిక స్థిరత్వం దక్కుతుంది.

