MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • ఈ 5 రాశులవారు ఎవ్వరి మాట వినరు.. అన్నీ తమకే తెలుసు అనుకుంటారు!

ఈ 5 రాశులవారు ఎవ్వరి మాట వినరు.. అన్నీ తమకే తెలుసు అనుకుంటారు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి స్వభావం వేరుగా ఉంటుంది. వారి జన్మ రాశుల ప్రభావం వల్ల కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఎవ్వరి మాట వినరు. వారికి నచ్చిందే చేస్తారు. వారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అంటారు. 

2 Min read
Author : Kavitha G
Published : Nov 20 2025, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎవ్వరి మాట వినని రాశులు
Image Credit : Asianet News

ఎవ్వరి మాట వినని రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశివారు ఒక్కో రకంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి తమ అభిప్రాయం పక్కా నిజమేనని నమ్మే స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవ్వరి మాటను సులభంగా నమ్మరు. ఎవ్వరి సలహా తీసుకోరు. ఎందుకంటే వీరిలో ఉన్న ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో అహంకారంగా మారుతుంది. పరిస్థితి ఏదైనా, నిర్ణయం ఏదైనా.. అన్నీ నాకే తెలుసు అన్న భావనలో ఉంటారు. అలా ఎవ్వరి మాట వినని రాశులేంటో తెలుసుకుందామా.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి
Image Credit : Pixabay

మేష రాశి

మేషరాశి వారు అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి ఒకసారి ఏదైనా ఆలోచన వచ్చినా లేదా ఏదైనా నిర్ణయం తీసుకున్నా దాన్ని మార్చడం చాలా కష్టం. ఏది తప్పో.. ఏది సరైనదో అన్న నిర్ణయాన్ని వీరు వెంటనే తీసుకుంటారు. దానివల్ల ఎవరు ఏం చెప్పినా వినరు. వేగంగా స్పందించడం, ఎమోషన్‌ ఆధారంగా ముందుకు సాగడం.. నేనే కరెక్ట్ అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరు ఎవ్వరి మాట వినరు. 

Related Articles

Related image1
ఈ 5 నెలల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. అన్నింట్లో ముందుంటారు!
Related image2
ఈ 4 రాశులవారితో జాగ్రత్త.. వీరు ఇతరుల తప్పులను ఎత్తిచూపడంలో ముందుంటారు!
36
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

వృషభరాశి రాశి వారు అత్యంత పట్టుదలతో ఉండే వ్యక్తులు. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని మార్చడం చాలా చాలా కష్టం. వీరి మొండితనానికి ప్రసిద్ధి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త సలహాలు.. మొదట్లో వీరికి అస్సలు నచ్చవు. ఎందుకంటే తాము తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని వీరు గట్టిగా నమ్ముతారు. అందుకే వీరు ఇతరుల మాటలకు చాలా తక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

46
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. వీరు తమ అభిప్రాయానికే విలువ ఇవ్వాలని కోరుకుంటారు. తాము తీసుకున్న నిర్ణయమే ఉత్తమం అని వీరి గాఢ నమ్మకం. ఇతరులు, వీరిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తే వీరికి అస్సలు నచ్చదు. ఎందుకంటే సింహరాశి వారు తమ ప్రతిష్ఠ, గౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. తమ నిర్ణయాలను తప్పని అనేవాళ్లతో వీరు కోపంగా మాట్లాడుతారు.

56
ధనుస్సు రాశి
Image Credit : AI Generated

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారు చాలా తెలివైనవారు. జ్ఞానం కలిగినవారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే దృష్టితో ముందుకు వెళ్తారు. కానీ ఈ విశాల దృష్టి కొన్నిసార్లు అతిశయంగా మారుతుంది. వీరు చదివింది ఎక్కువ, అనుభవం ఎక్కువ అన్న భావన వీరిని కొద్దిగా కఠినంగా మారుస్తుంది. అందువల్ల ఎవరైనా సలహాలు ఇస్తే.. “ఈ మాత్రం నాకు తెలియదా” అన్నట్లు స్పందిస్తారు. వీరి ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు ఇతరుల మాటలను పట్టించుకోకుండా ఉండేలా చేస్తుంది. 

66
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభరాశి రాశి వారు తమకంటూ ప్రత్యేకమైన ఆలోచనా విధానం కలిగి ఉంటారు. వీరికి తాము అనుకున్న మార్గమే సరైనది. ఇతరుల అభిప్రాయాలు తమ క్రియేటివిటీని దెబ్బతీస్తాయని వీరు భావిస్తారు. దానివల్ల ఈ రాశివారు ఎవ్వరి మాట వినరు. సమాజం ఎలా ఆలోచిస్తుందన్నది వీరు పట్టించుకోరు. తమకి కనబడే విజన్, ప్లాన్, ఐడియాలే ఫైనల్ అని ఈ రాశివారు బాగా నమ్ముతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
ఈ 5 నెలల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. అన్నింట్లో ముందుంటారు!
Recommended image2
ఈ 4 రాశులవారితో జాగ్రత్త.. వీరు ఇతరుల తప్పులను ఎత్తిచూపడంలో ముందుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved