ఈ నాలుగు నెలల్లో పుట్టారా..? ఈ అబ్బాయిలకు రెండో పెళ్లి అవకాశం చాలా ఎక్కువ..!
కొన్ని ప్రత్యేకమైన నెలల్లో పుట్టిన అబ్బాయిల జాతకంలో రెండో పెళ్లి రాసి ఉంటుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి, ఆ నెలలు ఏంటో చూద్దామా...

zodiac signs
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఒక వయసుకు వచ్చిన తర్వాత అందరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. దాదాపు అందరి జీవితంలో పెళ్లి ఒక్కసారే వస్తుంది. కానీ అందరికీ వివాహం సక్సెస్ అవ్వదు. అలాంటివారు విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని నెలలో జన్మించిన వారి జాతకంలో రెండో పెళ్లి యోగం చాలా ఎక్కువగా ఉంటుందట. మరి, ఆ నెలలు ఏంటో చూద్దామా....
ఏప్రిల్...
ఏప్రిల్ లో జన్మించిన వారు ఆశావాద స్వభావం కలిగి ఉంటారు. ఈ నెలలో పుట్టిన అబ్బాయిలు వివాహంలో భద్రత, స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మొదటి పెళ్లిలో ఇవి లభించకపోతే.. వారు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తాము కోరుకున్న వ్యక్తి జీవితంలో ఉండాలని అనుకుంటారు. అందుకే.. రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకాడరు.
జూన్...
జూన్ లో జన్మించిన అబ్బాయిలకు కూడా రెండో పెళ్లి యోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ అబ్బాయిలు సహజంగా స్వేచ్ఛ, ఆత్మ గౌరవం కోరుకుంటారు. మొదటి పెళ్లిలో స్వేచ్ఛ తగ్గింది అని వీరు భావిస్తే.. ఆ బంధం నుంచి బయటపడి.. రెండో పెళ్లికి సిద్ధ పడతారు. తమ స్వేచ్ఛను గౌరవించే వ్యక్తిని మాత్రమే తమ జీవితంలోకి ఆహ్వానించాలి అని వీరు కోరుకుంటారు.
ఆగస్టు
ఆగస్టులో జన్మించిన వారు విశాలహృదయులు. అందరినీ ప్రేమతో చూసుకోవాలని కోరుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే..అందరినీ సలహాలు అడుగుతారు. కానీ, తమ నిర్ణయాన్ని ఎవరైనా ఆపాలని చూసినా, అడ్డుకున్నా వీరికి నచ్చదు. భాగస్వామి తమ ఆలోచనలను గౌరవించకపోతే వారికి దూరమవుతారు. ఆలోచనలను పంచుకునే వ్యక్తితో జీవించాలని కోరుకుంటారు.
నవంబర్
నవంబర్‌లో జన్మించిన పురుషులు సామరస్యాన్ని, సమతుల్యతను కోరుకుంటారు. మొదటి వివాహంలో ఇవి లభించకపోతే, రెండవ వివాహంలో పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ రెండవసారి అడుగు వేయడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. భాగస్వామిని ఎంచుకోవడంలో తొందరపడరు.
డిసెంబర్
డిసెంబర్‌లో జన్మించిన పురుషులు భావోద్వేగపరులు, ఉత్సాహవంతులు. పనిపట్ల ఆసక్తి ఎక్కువ. మొదటి వివాహంలో సంతోషం లేకపోతే మళ్ళీ వివాహం చేసుకోవడం ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటారు. తమ అభిరుచులు, ఆసక్తులకు తగిన భాగస్వామితోనే జీవించాలనుకుంటారు. ఇష్టం లేని వ్యక్తితో మాత్రం జీవించలేరు.