- Home
- Astrology
- Birth Month: అమ్మాయిలు.. ఈ నెలలో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ సెట్ అయినట్లే
Birth Month: అమ్మాయిలు.. ఈ నెలలో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ సెట్ అయినట్లే
జోతిష్యం, న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిల్లో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వారి గుణం చాలా మంచిది. భార్యమీద పూర్తి నమ్మకంతో ఉంటారు.

Birth Month
ప్రతి అమ్మాయికీ పెళ్లి విషయంలో చాలా కలలు, కోరికలు ఉంటాయి. ముఖ్యంగా మన జీవితంలోకి వచ్చే అబ్బాయి తమను ప్రేమగా చూసుకోవాలని, తమ బంధానికి ఎక్కువ విలువ ఇవ్వాలని కోరుకుంటారు. అంతేకాకుండా.. తమపై పూర్తి నమ్మకం తో ఉండాలని కూడా భావిస్తారు. అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలు అందరికీ దొరకడం అంత సులభం ఏమీ కాదు. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం మాత్రం చాలా ఈజీగా వెతకొచ్చని మీకు తెలుసా?
జోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది?
జోతిష్యం, న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిల్లో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వారి గుణం చాలా మంచిది. భార్యమీద పూర్తి నమ్మకంతో ఉంటారు. వారిలో ఉన్న మంచి లక్షణాల కారణంగా.. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. అలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిల జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. మరి, ఆ నెలలు ఏంటో చూద్దామా....
మే నెల...
మేలో జన్మించిన అబ్బాయిలను పెళ్లాడే అమ్మాయిల జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే... వీరు తమ జీవితంలోకి వచ్చే అమ్మాయిని చాలా ప్రేమిస్తారు. వారి పట్ల జీవితాంతం నమ్మకంతో ఉంటారు. వారు ఇతరుల భావాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ముఖ్యంగా తమ లైఫ్ పార్ట్నర్ ఎమోషన్స్ ని పట్టించుకుంటారు. తమను ప్రేమించే వారిని, వీరు ప్రేమించే వారినీ ఎవరినీ వీరు మోసం చేయరు. తమ జీవిత భాగస్వామి పట్ల చాలా ప్రేమగా ఉంటారు.
జూన్ నెల..
జూన్‌లో జన్మించిన వ్యక్తులు మంచి మనసు కలిగి ఉంటారు. వారు తమ భార్యల పట్ల కలిగి ఉన్న ప్రేమ కారణంగా, వారు జీవితాంతం వారికి నమ్మకంగా ఉంటారు. ఈ గుణం కారణంగా, వారి భార్యలు తమ కలలలో కూడా తమ భర్తలకు ద్రోహం చేయరు. వారు నిజమైన భర్తలు మాత్రమే కాదు, తమ భార్యలను రక్షించే మంచి రక్షకులు కూడా అవుతారు. తమ భార్య ఆనందం కోసం వీరు ఏం చేయడానికైనా వెనకాడరు. ధైర్యంతో ముందడుగు వేస్తారు. వారు ఎల్లప్పుడూ తమ భార్యను ప్రేమిస్తూనే ఉంటారు.
అక్టోబర్ నెల...
అక్టోబర్‌లో జన్మించిన పురుషులు వారి వైవాహిక జీవితంలో చాలా నమ్మకంగా ఉంటారు. వారి భార్యల పట్ల వారి లోతైన నిబద్ధత కారణంగా వారి సంబంధం చాలా కాలం పాటు ఉంటుంది. ఈ గుణం కారణంగా వారి భార్యలు కూడా వారికి విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఈ నెలలో జన్మించిన పురుషులు తమ భార్యలతో ఎమోషనల్ గా కనెక్షన్ పెంచుకుంటారు. అందువల్ల, వారు తమ భార్యలను ఎప్పటికీ మోసం చేయాలనుకోరు. వారు దాని గురించి కూడా ఆలోచించరు. వారి వివాహం బలంగా ఉండాలని వారు కోరుకుంటారు. దాని కోసం వారు చాలా ప్రయత్నాలు చేస్తారు.