Zodiac sign:ఈ రాశివారికి మెచ్యూరిటీ చాలా ఎక్కువ...!
మెచ్యూరిటీ ఉన్నవారు పరిస్థితులను అర్థం చేసుకుంటారు.. ఉన్నతంగా ఆలోచిస్తారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారికి ఎంత మెచ్యూరిటీ ఉంటుందో ఓసారి చూద్దాం...

ఎలాంటి పరిస్థితిని అయినా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు మెచ్యూరిటీ అనేది ఉండాలి. మనకు మెచ్యూరిటీ ఉన్న వారు చేసే పనికీ.. మెచ్యూరిటీ లేనివారికి చేసే పనికి చాలా తేడా ఉంటుంది. మెచ్యూరిటీ ఉన్నవారు పరిస్థితులను అర్థం చేసుకుంటారు.. ఉన్నతంగా ఆలోచిస్తారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారికి ఎంత మెచ్యూరిటీ ఉంటుందో ఓసారి చూద్దాం...
1.మేష రాశి...
మేష రాశివారికి మెచ్యూరిటీ లెవల్స్ చాలా తక్కువ అనే చెప్పాలి. రెండేళ్ల చిన్నారికి ఎంతైతే మెచ్యూరిటీ ఉంటుందో.. ఈ రాశివారికి కూడా అంతే ఉంటుంది. అంతకు మించి వీరి నుంచి మనం మచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయలేం.
2.వృషభ రాశి..
ఈ రాశివారికి మచ్యూరిటీ లెవల్స్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఈ రాశివారు... 20ఏళ్ల వయసులో కూడా 50ఏళ్ల వయసులో ఉన్నవారిలా ఆలోచిస్తారు. వీరి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. మెచ్యూరిటీ ఎక్కువ అనే చెప్పాలి.
3.మిథున రాశి..
ఈ రాశివారు వయసు ఎంత పెరిగినా... టీనేజ్ వయసు వారిలానే ప్రవర్తిస్తారు. వారు దేని గురించి పట్టించుకోరు. హై స్కూల్ పిల్లల మాదిరి ప్రవర్తిస్తారు.
4.కర్కాటక రాశి...
ఈ రాశివారు ముసలమ్మల్లా ప్రవర్తిస్తారు. ఓ తల్లి... తన బిడ్డల విషయంలో ఎలా కంగారుపడతారో ఆ విధంగా వారు కంగారుపడతారు. ఈ రాశివారికి చాలా మెచ్యూరిటీ ఎక్కువ.
5.సింహ రాశి..
ఈ రాశివారికి మెచ్యూరిటీ చాలా తక్కువ. ఒక్కోసారి మచ్యూరిటీ ఉన్నట్లే ప్రవర్తించినా... మరోసారి అసలు మెచ్యూరిటీ లేనివారిలా ప్రవర్తిస్తారు. ఈ రాశివారు దాదాపు ఆరేళ్ల చిన్నారి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ చిన్నపిల్లల్లా బొమ్మల గురించి మాట్లాడుతూ ఉంటారు.
6.కన్య రాశి..
కన్య రాశివారికి మెచ్యూరిటీ చాలా ఎక్కువ. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. అన్నీ అర్థం చేసుకుంటారు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. చిన్నతనం నుంచే పెద్దవారిలా ప్రవర్తిస్తారు.
7.తుల రాశి...
తుల రాశివారు ఎంత వయసు పెరిగినా.. టీనేజ్ మనస్తత్వం ఉన్న వారిలా ప్రవరిస్తారు. టీనేజ్ పిల్లలు ఎప్పుడు సరదాగా గడుపుదామా అని అనుకున్నట్లే.. వీరు కూడా తాపత్రయపడతారు. సరదాగా ఎంజాయ్ చేయాలి.. పార్టీలకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు ఒక్కోసారి చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తించినా.. మరోసారి మెచ్యూరిటీ లేనివారిలా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి వయసు తగినట్లు ప్రవర్తిస్తారు.. మరోసారి మాత్రం.. చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు.
9. ధనస్సు రాశి...
ఈ రాశివారు కూడా వయసుకు తగినట్లు ప్రవర్తించరు. వీరికి కూడా మెచ్యూరిటీ కాస్త తక్కువ అనే చెప్పాలి. ఎంత వయసు వచ్చినా.. బాధ్యతలు పట్టించుకోకుండా.. రోడ్లు పట్టుకు తిరగాలని అనుకుంటూ ఉంటారు. తమ సరదాలు మాత్రమే వారు చూసుకుంటారు.
10.మకర రాశి...
ఈ రాశివారికి మెచ్యూరిటీ ఎక్కువే కానీ.. పాతకాలం పద్దతులు పట్టుకొని వేలాడుతూ ఉంటారు. పాత స్కూల్ టీచర్ లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ఉన్న మోడ్రన్ సిద్దాంతాలను వీరు తొందరగా అంగీకరించరు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి మచ్యూరిటీ చాలా ఎక్కువ అనే చెప్పాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. వారి వయసును బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా ఉంటారు.
12. మీన రాశి...
మీన రాశివారికి మెచ్యూరిటీ ఉందో లేదో స్పష్టంగా చెప్పలేం. ఒక్కోసారి మరీ చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు. మరోసారి.. వయసు మళ్లిన ముసలి తాత లాగా ప్రవర్తిస్తారు. వయసుకు తగినట్లు మాత్రం ప్రవర్తించరు.