- Home
- Astrology
- తులా రాశిలోకి కుజుడు.. సెప్టెంబర్ 13 నుంచి ఈ 4 రాశుల వారికి పండగే. ఆకస్మిక ధన లాభంతో పాటు..
తులా రాశిలోకి కుజుడు.. సెప్టెంబర్ 13 నుంచి ఈ 4 రాశుల వారికి పండగే. ఆకస్మిక ధన లాభంతో పాటు..
కుజ గ్రహ ప్రభావం మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. సెప్టెంబర్‌లో కుజుడు గమనంలో వచ్చే మార్పులు కొన్ని రాశుల వారికి లాభాలను అందిస్తుంది. ఆ రాశులు ఏంటంటే.?

తులా రాశిలోకి కుజుడు
సెప్టెంబర్ 13, 2025 రాత్రి 9:34 గంటలకు కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. మరుసటి రోజే శుక్రుడు కూడా తులా రాశిలోకి చేరతాడు. దీంతో భృగు-మంగళ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం వల్ల శక్తి, ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం పెరుగుతాయి. లక్ష్యాలను సాధించడానికి కొత్త ఉత్సాహం వస్తుంది.
వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు
* వృశ్చిక రాశి వారికి కుజ గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది.
* ఆస్తి, వాహనాల వ్యాపారంలో లాభాలు పొందుతారు.
* ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి.
* పనితీరు మెరుగుపడుతుంది, పై అధికారులు ప్రశంసిస్తారు.
* ఆకస్మికంగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి వారికి సంపద పెరుగుదల
* కుంభ రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు.
* ప్రభావవంతమైన వ్యక్తుల సహకారం లభిస్తుంది.
* ఉద్యోగం, ఆదాయం రెండు రంగాల్లోనూ కొత్త అవకాశాలు వస్తాయి.
* పెట్టుబడులకు ఇది మంచి సమయం, దీర్ఘకాల లాభాలు పొందవచ్చు.
* ఆర్థిక స్థితి బలపడుతుంది.
మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* మేష రాశి వారికి ఈ గోచారం ప్రేరణనిస్తుంది.
* ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
* లక్ష్యం వైపు కృషి చేసే తపన పెరుగుతుంది.
* కుటుంబ సభ్యుల మద్దతు లభించి ఆనందం పొందుతారు.
మిథున రాశి వారు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం
* మిథున రాశి వారికి కూడా కుజ గోచారం అనుకూలమే.
* ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
* కుటుంబ సంబంధాలలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
* వ్యాపారం వేగంగా ఎదుగుతుంది.
* శ్రేయస్సు, సౌఖ్యం కలుగుతుంది.