Mars Transit: ధనుస్సులోకి కుజ గ్రహ ప్రవేశం... ఈ రాశులకు మహర్దశ మొదలైనట్లే
Mars Transit: జోతిష్యంలో కుజుడు శక్తి, ధైర్యం, ఆర్థిక ఎదుగుదల, నాయకత్వానికి సూచికగా పరిగణిస్తారు. ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే విజయాలు అందుకుంటారు. ఇప్పుడు ధనుస్సు రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. దీని వల్ల ఐదు రాశులకు కలిసి రానుంది. ఆ రాశులేంటో చూద్దాం..

కుంభ రాశి... కలలు నిజమయ్యే కాలం....
ధనుస్సు రాశిలోకి కుజుడు ప్రవేశించడం కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా మారనుంది. ఈ రాశివారి పదకొండో ఇంటిపై కుజుడు ప్రభావం చూపించనున్నాడు. అందుకే... ఈ సమయంలో కుంభ రాశివారి ఆదాయం పెరుగుతుంది. వారు కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. వ్యాపారాల్లోనూ లాభాలు వస్తాయి.
సింహ రాశి.... కెరీర్ లో పీక్ పీరియడ్...
కుజుడు సంచారం సింహ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి తెలివితేటలు, సృజనాత్మకత, లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. పిల్లలతో సంబంధాలు మెరుగౌతాయి. చదువు, ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. కొత్త కెరీర్ అవకాశాలు వస్తసాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది.
మేష రాశి... శుభవార్తలు వింటారు
...
కుజుడు సంచారం.. మేష రాశివారికి ఊహించని లాభాలు తెస్తుంది. అదృష్టం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొంచెం కష్టపడినా విజయాలు అందుకుంటారు.
తుల రాశి..ఆస్తి లాభాలు...
తుల రాశి మూడో ఇంటిలో కుజుడు ఉండడంతో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. ఆస్తి లాభాలు, సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాల్లో ధైర్యంగా పెట్టుబడులు పెట్టితే ఫలితాలు సానుకూలంగా వస్తాయి.
మీన రాశి.. కెరీర్ గ్రోత్...
ఈ రాశి పదవ ఇంటిలో కుజ సంచారం మీనరాశివారికి పదవీ ఉన్నతి, పురస్కారాలు, మంచి ఆదాయం, ప్రాపర్టీ లాభాలు తెస్తుంది. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. రాజకీయ, ప్రభుత్వ, డిఫెన్స్, ఐటీ రంగాల్లో అదృష్టం బలంగా ఉంటుంది.

