Zodiac Signs: త్వరలో ఈ ఆరు రాశులవారికి వివాహ యోగం.. మీ రాశి ఉందో చూడండి!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాలు మిథున, కర్కాటక రాశుల్లో శుభప్రదంగా సంచరిస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి వివాహ యోగం ఉంది. మరి ఆ రాశులేంటో అందులో మీ రాశి ఉందో ఓ సారి చెక్ చేసుకోండి.

మేష రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు, శుక్ర గ్రహాలు మేష రాశి మూడో ఇంట్లో ఉండటం, గురువు ఏడో ఇంటిపై దృష్టి వేయడంతో పరిచయస్తులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహం జరిగే అవకాశం ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తే మంచి సంబంధం కుదురుతుంది. వరుడు లేదా వధువు ధనవంతుల కుటుంబానికి చెందినవారై ఉండవచ్చు. పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం.
వృషభ రాశి
వృషభ రాశి కుటుంబ స్థానంలో గురు, శుక్రుల శుభ యోగం వల్ల ఈ రాశి వారికి పెళ్లి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది. పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి కూడా ఇది మంచి సమయం. తక్కువ ప్రయత్నంతోనే సంబంధం కుదురవచ్చు. బంధువుల మధ్య లేదా బంధువుల ద్వారా వివాహ ప్రయత్నాలు చేయడం మంచిది. ఇష్టపడిన వ్యక్తితో వివాహం అయ్యే అవకాశం కూడా ఉంది.
సింహ రాశి
సింహ రాశి శుభ స్థానంలో గురు, శుక్రుల యోగం వల్ల ఈ రాశి వారు త్వరలోనే ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. సాధారణంగా ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా, తక్కువ సమయంలోనే వివాహం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. గ్రహగతులను బట్టి బంధువుల మధ్య వివాహం జరిగే అవకాశం ఉంది. స్థానికంగా సంబంధాలు చూసుకోవడం మంచిది.
తుల రాశి
తుల రాశి తొమ్మిదో ఇంట్లో గురు, శుక్రుల సంచారం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే వివాహం జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశం ఉంది. ఇష్టపడిన వ్యక్తితో లేదా పరిచయస్తులతో ఊహించని విధంగా వివాహం జరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి ఐదో ఇంట్లో గురు, శుక్ర సంచారం వల్ల ఈ రాశిలో జన్మించిన వారు చాలా తక్కువ సమయంలోనే వివాహం చేసుకుంటారు. కొద్దిగా ప్రయత్నిస్తే సెప్టెంబర్ నాటికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఇష్టపడిన వ్యక్తితో వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. చాలా ధనవంతులైన కుటుంబంతో వివాహానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. బంధువుల సహాయంతో వివాహం జరుగుతుంది.