Zodiac Signs: కర్కాటక రాశిలో రాజయోగం.. ఈ నాలుగు రాశులవారికి డబ్బు సమస్యలు తీరినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమ, అందం, ఆనందం, సంపదలకు కారకుడైన శుక్రుడు.. తెలివితేటలు, జ్ఞాపకశక్తి, వ్యాపారాలకు కారకుడైన బుధుడితో కలిసి త్వరలో రాజయోగం ఏర్పరచనున్నాడు. ఈ ప్రభావంతో 4 రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి.

లక్ష్మీ నారాయణ రాజయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశులు మారుతుంటాయి. ఈ రాశి మార్పు వల్ల ఇతర గ్రహాలతో కలిసి కొన్ని రాజయోగాలు ఏర్పరుస్తుంటాయి. దాదాపు ఏడాది తర్వాత శుక్రుడు, బుధుడు కలిసి కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. దానివల్ల కొన్ని రాశులవారి జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 21న కర్కాటక రాశిలో శుక్రుడు సంచరించినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.
ఏ రాశులకు మేలు జరుగుతుంది?
జ్యోతిష్య శాస్త్రంలో బుధ, శుక్ర గ్రహాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. బుధుడు తెలివితేటలు, వాక్కు, వ్యాపారానికి ప్రతీక. శుక్రుడు ధనం, ప్రేమ, కళలు, సంతోషకరమైన జీవితానికి ప్రతీక. బుధుడు విష్ణువుని, శుక్రుడు లక్ష్మీదేవిని సూచిస్తారు. కాబట్టి ఈ రెండు గ్రహాల కలయికను శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం, సంపద కలిసివస్తుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
వృషభ రాశి
లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. వ్యాపారులకు ఇది అనుకూల సమయం. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో ఈ రాజయోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి రాబోయే 30 రోజులు శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు పొందవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది.
తుల రాశి
జ్యోతిష్యం ప్రకారం తుల రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం లభించవచ్చు. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రాజయోగం చాలా మంచి ఫలితాలనిస్తుంది. వీరి జీవితంలో అదృష్టం ప్రకాశిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి.