September Horoscope: గ్రహాలలో మార్పులు..సెప్టెంబర్ లో ఈ రాశుల ఇంట కనక వర్షమే..!
సెప్టెంబర్ నెలలో మూడు రాశులకు లక్ష్మీ కటాక్షం కలగనుంది. వారు ఊహించనంత డబ్బు.. ఈ నెలలో వారు చూసే అవకాశం ఉంది.

Mangal Gochar
గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు.. కొన్ని రాశులకు ప్రయోజనాలు తెస్తే.. మరి కొన్ని రాశులకు నష్టాలు మోసుకువస్తాయి. సెప్టెంబర్ 3 తర్వాత కుజుడు చిత్తా నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీని తర్వాత సెప్టెంబర్ 23వ తేదీన కుజుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో, సెప్టెంబర్ 15న కుజుడు తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పుల కారణంగా.. ఈ నెలలో మూడు రాశులకు లక్ష్మీ కటాక్షం కలగనుంది. వారు ఊహించనంత డబ్బు.. ఈ నెలలో వారు చూసే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
1.మేష రాశి...
కుజుడు సంచారంలో మూడుసార్లు మార్పు మేష రాశివారి జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ధైర్యం, విశ్వాసం, సామర్థ్యం,సౌకర్యాలు అన్నీ పెరుగుతాయి. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో.. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే.. ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది చాలా అనువైన సమయం. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం, జీతం పెరిగే ఛాన్స్ ఉంది.
2.వృశ్చిక రాశి...
కుజుడు తన స్థానాన్ని మూడుసార్లు మార్చుకోవడం వృశ్చిక రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పని శైలిని మెరుగుపరచుకోవడం ద్వారా బాగా పని చేయగలరు. వ్యాపారం మెరుగుపడుతుంది. కొత్త సంపాదన మార్గాలను కనుగొని వాటిలో విజయం సాధించడానికి ఇది మంచి సమయం అవుతుంది. మీ సామాజిక , వ్యాపార సంబంధాలు బలంగా ఉంటాయి, ఇది లాభానికి కొత్త అవకాశాలను కూడా అందిస్తుంది. బంధువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.వారి సహాయంతో ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే, మీకు ఎప్పటికప్పుడు ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా సాధ్యమే.
3.కుంభ రాశి..
కుజుడు తన స్థానాన్ని మూడుసార్లు మార్చే ప్రభావం కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరగవచ్చు. మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఉద్యోగులు ప్రభావవంతమైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందుతారు. ఇది మీ పని శైలిని మెరుగుపరుస్తుంది. మీరు కొత్త అనుభవాలను పొందుతారు. ఈ సమయం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ సంపాదనలో మంచి భాగాన్ని పొదుపులో పెట్టుబడి పెట్టగలరు. ఇది మీ భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తుంది.