MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Astrology: అరుదైన మహాలక్ష్మి రాజయోగం.. ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!

Astrology: అరుదైన మహాలక్ష్మి రాజయోగం.. ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!

Mahalakshmi Rajayoga 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశిలో చంద్రుడు, అంగార కలయిక వల్ల మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. ఇంతకీ ఆ అదృష్ట రాశులేంటో ఓ లూక్కేయండి.

2 Min read
Author : Rajesh K
Published : Jul 26 2025, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

సింహ రాశిలో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం వల్ల మిథున రాశి వారికి అనేక విషయంలో అనుకూల ఫలితాలు రాబోతున్నాయి.  ఈ కాలంలో ఉద్యోగంలో పురోగతి, అభినందనలతో పాటు ఆర్థికాభివృద్ధి కనిపించవచ్చు. వ్యాపారం ప్రారంభించదలచినవారికి ఈ సమయం చాలా అనుకూలం. వీరి వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్తగా పెళ్లైన దంపతులకు సంతానయోగం కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పిల్లల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో ఆనందం, ఆరోగ్యంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి వారికి మంచి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి రిటర్న్స్ పొందే అవకాశముంది. వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు ఏర్పడి లాభదాయకంగా మారుతాయి. వైవాహిక జీవితం ఆనందదాయకంగా మారుతుంది. సంపాదనలో వృద్ధితో పాటు, కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడే సమయంగా కనిపిస్తుంది.

34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి మహాలక్ష్మి  రాజయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో కేతువు కూడా అదే రాశిలో ఉండటం వలన వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరి సంపద పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ, పరిపాలనా, మీడియా వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు, పురోగతి లభిస్తుంది. మీరు గతంలో ఎంతో కృషిచేసిన పనుల్లో విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త వాహనం, స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు, అభివృద్ధి సాధిస్తారు. 

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి చంద్రుడు, మంగళుడు కలయికతో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం ప్రత్యేకమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రెండు గ్రహాల అనుకూలత వల్ల గతంలో ఎదురైన సమస్యలు ఇప్పుడు పరిష్కారం అయ్యే అవకాశముంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలోనూ, కుటుంబంలోనూ ఎదురయ్యే వివాదాలు పరిష్కారమవుతాయి. కేతువు ఆరవ ఇంటిలో ఉండటంతో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 

అంతేగాక ఐదవ ఇంటిలో బుధాదిత్య యోగం ఉండటంతో మీ మానసిక స్థితి బలపడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులు విదేశాల నుంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
మహిళలు
జ్యోతిష్యం
రాశి ఫలాలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Astrology: శ‌ని ప్ర‌భావంతో ఇబ్బంది ప‌డుతున్నారా.? ఇలా చేస్తే అన్నింటా విజ‌య‌మే
Recommended image2
Astrology: బుధుడి వక్ర గమనం.. ఆ రాశుల వారికి 70 రోజుల కుబేర యోగం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved