MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!

Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!

Birth Date: పుట్టిన తేదీ ప్రకారం కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, డబ్బుకు లోటు ఉండదని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఏ వస్తువులను పర్సులో, లేదా తమ దగ్గర ఉంచుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 22 2026, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో పెట్టుకోవాల్సిన వస్తువులు
Image Credit : Asianet News

పుట్టిన తేదీ ప్రకారం పర్సులో పెట్టుకోవాల్సిన వస్తువులు

జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. అలాగే, సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ, అదృష్టం పెరుగుతాయని నమ్మకం. పుట్టిన తేదీ ప్రకారం 1 నుంచి 9 వరకు మూలసంఖ్యలు ఉన్నవాళ్లు ఏ వస్తువులను పర్సులో లేదా తమ దగ్గర ఉంచుకుంటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మూలసంఖ్య 1, 2
Image Credit : chatgpt

మూలసంఖ్య 1, 2

ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 1. దీనికి అధిపతి సూర్యుడు. వీరు తమ పర్సులో ఒక వెండి నాణెం లేదా రాగి బిళ్ల ఉంచుకుంటే అదృష్టం పెరుగుతుందని నమ్మకం. ఇది డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

ఇక 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన మూలసంఖ్య 2. దీనికి అధిపతి చంద్రుడు. వీరు తమ పర్సులో లేదా పనిచేసే చోట స్వచ్ఛమైన ముత్యం లేదా తెల్లటి స్పటికాన్ని ఉంచుకోవడం వల్ల సంపద, కొత్త అవకాశాలు వస్తాయని నమ్మకం.

36
మూలసంఖ్య 3, 4
Image Credit : chatgpt

మూలసంఖ్య 3, 4

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 3. దీనికి అధిపతి గురుడు. వీరు పసుపు కలిపిన బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం శుభప్రదం. ఇవి సంపదను పెంచి, డబ్బుకు సంబంధించిన అడ్డంకులను తగ్గిస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలాగే 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. వీరు తమ దగ్గర ఒక చిన్న స్క్వేర్ షేప్ వెండి రేకును ఉంచుకోవడం మంచిది. ఇది కొత్త ఆదాయ మార్గాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతుందని, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం.

46
మూలసంఖ్య 5, 6
Image Credit : chatgpt

మూలసంఖ్య 5, 6

5, 14, 23 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 5. దీనికి అధిపతి బుధుడు. వీరు తమ దగ్గర ఒక చిన్న శంఖాన్ని ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. శంఖం లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి, ఇది డబ్బును, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం.

6, 15, 24 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 6. దీనికి అధిపతి శుక్రుడు. వీరు తమ పర్సులో ఒక చిన్న శ్రీ యంత్రాన్ని ఉంచుకోవడం మంచిది. ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచి, జీవితంలో సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్మకం.

56
మూలసంఖ్య 7, 8
Image Credit : chatgpt

మూలసంఖ్య 7, 8

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 7. దీనికి అధిపతి కేతువు. వీరు తమ దగ్గర గోమతి చక్రాన్ని ఉంచుకోవడం శుభప్రదం. దీనికి లక్ష్మీదేవితో సంబంధం ఉన్నందున, డబ్బు, శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం.

8, 17, 26 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 8. దీనికి అధిపతి శని. వీరు తమ పర్సులో తామర గింజలను ఉంచుకోవడం మంచిది. ఇది ఆర్థికవృద్ధికి అనుకూలమైన శక్తిని ఆకర్షిస్తుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

66
మూల సంఖ్య 9
Image Credit : AI Image

మూల సంఖ్య 9

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 9. దీనికి అధిపతి కుజుడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. వీరు తమ దగ్గర ఎరుపురంగు క్లాత్, లేదా రాగి నాణెం ఉంచుకోవడం శుభప్రదమని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు.. సానుకూల ఫలితాలు!
Recommended image3
Mercury Transit: బుధుడి సంచారంతో ఈ 5 రాశులకు మహర్దశ.. అప్పుల నుంచి విముక్తి!
Related Stories
Recommended image1
Vastu Tips: వాస్తు ప్రకారం మంచం కింద ఈ 5 రకాల వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!
Recommended image2
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved