- Home
- Astrology
- Guru Shukra Gochar:100 ఏళ్ల తర్వాత రాజయోగం.. డిసెంబర్ 20 తర్వాత ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్
Guru Shukra Gochar:100 ఏళ్ల తర్వాత రాజయోగం.. డిసెంబర్ 20 తర్వాత ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్
Guru Shukra gochar: జోతిష్య శాస్త్రం ప్రకారం, డిసెంబర్ 20 తర్వాత ఓ రాజయోగం ఏర్పడుతోంది. దాదాపు వందేళ్ల తర్వాత సంసప్తక రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం తో ఐదు రాశులకు ప్రయోజనాలు కలిగించనుంది..

Guru Shukra gochar
జోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహాన్ని భౌతిక సుఖాలు, శ్రేయస్సుకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ శుక్రుడు డిసెంబర్ 20న ధనుస్సు రాశిలో అడుగుపెట్టనున్నాడు. ఈ కాలంలో గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల గరు, శుక్ర గ్రహాలు ఒకదానితో మరొకటి 7వ స్థానంలో సంచరిస్తూ సంసప్తక రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ రాయోగం దాదాపు వందేళ్ల తర్వాత ఏర్పడబోతోంది. డిసెంబర్ 20 నుంచి జనవరి 12 వరకు ఈ రాజయోగ ప్రభావం ఉంటుంది. దీని కారణంగా లాభం పొందే రాశులేంటో ఇప్పుడు చూద్దాం...
1.మేష రాశి...
ఈ రాజయోగం మేష రాశి వారికి చాలా ప్రయోజనాలు కలిగించనుంది. ఈ రాశివారి అదృష్ట ద్వారాలు తెరచుకోనున్నాయి. జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి మంచి లాభాలు కూడా లభిస్తాయి. కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి సాహసోపేతంగా అడుగులు వేస్తారు. కొత్త ఇల్లు కొనాలనే కోరిక నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ఏవైనా విభేదాలు ఉంటే, అవి కూడా తీరిపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
2.సింహ రాశి...
ఈ రాజయోగం సింహ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉండనుంది, ఈ రాశి వారికి జీవితంలోని ప్రతి రంగంలోనూ అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి. 2026 ప్రారంభం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు పెరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాజయోగం కారణంగా ఈ రాశివారికి వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీ జీవితానికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది.
3.తుల రాశి...
ఈ రాజయోగం తుల రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారి ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అనుకున్న ప్రతి పనినీ పూర్తి చేయగలుగుతారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంత వ్యాపారాలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో మంచి పురోగతి సాధించగలరు. ఉద్యోగ, వ్యాపారాల్లో, వ్యక్తిగత విషయాల్లో ఏవైనా ఒత్తిడి ఉంటే.. అది తగ్గిపోయే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి...
ఈ రాజయోగం వృశ్చిక రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి ధైర్యం పెరుగుతుంది. 2026 ప్రారంభంలో ఈ రాశివారు మంచి దిశలో పయనిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీకు అనుకూలంగా ఉంటుంది. పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. స్నేహితులతో కలిసి ట్రిప్ కి వెళ్లే అవకాశం ఉంది.
మీన రాశి...
ఈ రాజయోగం మీన రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు వేసే ప్రతి అడుగులోనూ అదృష్టం లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశికి చెందినవారు చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోనూ వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

