ఈ వారం మీ ప్రేమ జాతకం.. 4 జూలై నుండి 10 జూలై 2022 వరకు ఎలా ఉందంటే...
ప్రేమ.. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ అత్యంత ప్రాముఖ్యమైనది. అది లేకపోతే జంటల మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రేమైక జీవితాన్ని సాధించాలంటే కొన్ని ఒడిదుడుకులు, సర్దుబాట్లు తప్పనిసరి. ఈ వారం మీ ప్రేమ జీవితం ఎలా ఉందో.. జ్యోతిష్యుడు చిరాగ్ దారువాలా ఇలా చెబుతున్నారు.

Aries Zodiac
మేషం : ఈ వారం బృహస్పతి తన సొంత ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు లభిస్తాయి. దీనివల్ల మీరు మీ భాగస్వామిని హృదయపూర్వకంగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మూడో వ్యక్తి కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం వచ్చి ఉంటే, ఈ సమయంలో అది దూరం కావచ్చు. మీ ప్రేమ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది. మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తారు. మీ ప్రవర్తనలోనూ అవసరమైన మార్పులు చేసుకుంటారు. మీమీద, మీ కుటుంబం మీద మీ జీవిత భాగస్వామి చూపించే శ్రద్ధ, ప్రేమ మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. దీనివల్ల మీరు వారితో కలిసి చిన్న చిన్న టూర్స్ కు, పార్టీలకు వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
Taurus Zodiac
వృషభం : మీ భాగస్వామి తన హృదయంలోని భావాల్ని నోరువిప్పి చెప్పరనేది ఫిర్యాదు అయితే.. అది పూర్తిగా మర్చిపోండి. ఎందుకంటే ఈ వారం మీ భాగస్వామి మీ మీద తనకున్న ప్రేమను మనసువిప్పి మాట్లాడతాడు. దీనివల్ల మీ ప్రేమ బంధం బలపడుతుంది. మీరు ఒకరికొకరు దగ్గరవుతారు. ఈ వారం బృహస్పతి అనుకూలమైన స్థానంతో, మీ వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక అందమైన అంశాలు గుర్తు చేసుకుని మీరు భావోద్వేగానికి గురవుతారు. అది చూసిన మీ భాగస్వామి మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తారు. మీరు ప్రతి సాయంత్రం మీ భాగస్వామితో గడపడానికి ఇష్టపడతారు.
Gemini Zodiac
మిథునం : ఈ రాశివారి లవ్ లైఫ్ కి ఈ వారం చాలా మంచిది. మీ లవ్ లైఫ్ లోని బలమైన వైపు మాత్రమే మీరు చూస్తారు. ఒకరిమీర మరొకరికి ప్రేమ భావన బలంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ సమస్యల నుండి బయటపడటానికి మీ భాగస్వామి మద్దతు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీ వైవాహిక జీవితంలో శుక్రుని అనుకూలమైన స్థానం మీ కుటుంబం పట్ల మీ జీవిత భాగస్వామి శ్రద్ధగల ప్రవర్తన మిమ్మల్ని గర్వించేలా చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ భాగస్వామి ఇంట్లో పెద్దలకు అంకితభావంతో సేవ చేయడం చూసినప్పుడల్లా వారి పట్ల మీ ఆకర్షణ మరింత పెరుగుతుంది.
కర్కాటకం : ఈ వారం ఈ రాశివారు ప్రేమ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం చంద్రుని రాశి అయినందున.. మీ రాశిచక్రంలో ఎనిమిదవ ఇంట్లో కుజుడు ఉన్నందున కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరైనా మిమ్మల్ని తప్పుగా ప్రేమించవచ్చు, సరసాలాడవచ్చు, ప్రేమిస్తున్నామని నమ్మించవచ్చు.. అదంతా నిజమైన ప్రేమ కాదని తెలిసి మీ హృదయాన్ని బద్దలవ్వచ్చు. కాబట్టి ఈ వారం ప్రేమ వ్యవహారాల్లో తొందరపడకండి. వైవాహిక జీవితం మెరుగుపడాలంటే, ప్రతికూల పరిస్థితుల్లో జీవిత భాగస్వామి ముందు మౌనంగా ఉండడం తెలివైన పని. మీరు ఈ వారం కూడా ఈ విషయాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మనస్సు కలత చెందవచ్చు. అటువంటి పరిస్థితిలో, వివాదం పెద్దగవ్వొద్దని మీరు కోరుకుంటే, మౌనంగా ఉండటమే సరైనది.
Leo
సింహం : ప్రేమ ను నిలుపుకోవడం.. ఆ దారిలో ప్రయాణించడం అనుకున్నంత సులభం కాదని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మీ భాగస్వామితో ఏదైనా వివాదం ముగియగానే, మరో కొత్త సమస్య మొదలవుతుందని మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వారం మీరు ఈ విషయంలో చిన్నగానో, పెద్దగానో ఇబ్బంది పడతారు. ఈ వారం మీరు సంభాషణ సమయంలో మీ అత్తమామల గురించి నెగటివ్ చెప్పకూడదు. ఇది మీ జీవిత భాగస్వామిని బాధపెడుతుంది. ఫలితంగా, తను మీతో గంటల తరబడి మాట్లాడకుండా తన అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ తప్పును అంగీకరించి, వెంటనే భాగస్వామికి క్షమాపణలు చెప్పి, వారి చికాకును తొలగించి ముందుకు సాగడమే మంచిది.
Virgo Zodiac
కన్య : మీ భాగస్వామి తన హృదయంలోని భావాల్ని నోరువిప్పి చెప్పరనేది ఫిర్యాదు అయితే.. అది పూర్తిగా మర్చిపోండి. ఎందుకంటే ఈ వారం మీ భాగస్వామి మీ మీద తనకున్న ప్రేమను మనసువిప్పి మాట్లాడతారు. కన్యారాశి కూడా చంద్రుని రాశే. ఈ రాశిలో పదకొండవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. కుజుడు సంబంధాలకు సంకేతం. ఇలా చేయడం వల్ల మీ ప్రేమ బంధం బలపడుతుంది. మీరు ఒకరికొకరు దగ్గరవుతారు. వివాహితులకు, ఈ వారం మీ జీవితంలో అనేక బహుమతులను తెస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ జీవిత భాగస్వామితో మీకు ఏవైనా విభేదాలు ఉంటే, ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు.
Libra Zodiac
తుల : మీరు మీ భవిష్యత్తును సరిదిద్దుకోవాలనుకుంటే, ఈ వారం మీ భాగస్వామితో చిన్నచిన్న విషయాలపై గొడవలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ గొడవల వల్ల మీకు అనవసరమైన టెన్షన్. అంతేకాకుండా మీ ఇద్దరి మధ్య ఇష్టం లేకపోయినా చాలా ప్రతికూల పరిస్థితులు, మనస్పర్థలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఇటీవలే వివాహం అయినట్లయితే, మీ బంధంలో ఇంకా సమకూలత కుదరకపోతే.. అది ఈ వారం కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో బృహస్పతి శుభ స్థానం కారణంగా, మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోగలుగుతారు, అలాగే, మీ భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేయడం కూడా కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరికీ ఒకరి అంచనాలను మరొకరు తెలుసుకునే అవకాశం ఇస్తుంది. దీని వల్ల రిలేషన్ షిప్ లో మంచి మార్పు కనిపిస్తుంది.
Scorpio
వృశ్చికం : మీ రాశి ప్రేమికులు స్వభావరీత్యా భావోద్వేగాలు, శ్రద్ధగలవారు. మీ భాగస్వామి విజయవంతమైన ప్రేమికుడిగా మారడానికి ఇదే కారణం. ఈ వారం, మీ రాశి నుండి ఏడవ ఇంట్లో కుజుడు ఉన్నందున, మీ వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు, మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం చాలా బాగుంటుంది. మీ భాగస్వామి చెప్పకుండానే వారి మాటలను మీరు తెలుసుకుంటారు. దీనితో పాటు, మీరు మీ జీవిత భాగస్వామితో ఫోన్‌లో లేదా సోషల్ మీడియాలో గంటల తరబడి మాట్లాడవచ్చు.
Sagittarius Zodiac
ధనుస్సు : ప్రేమ అనేది ఒక మృదువైన భావన, ఇది అందరికీ అర్థం కావడం సులభం కాదు, కాబట్టి ఈ వారం మీ రాశి నుండి ఐదవ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల, ఆచరణాత్మకంగా కంటే ఎక్కువ ఉద్వేగభరితంగా, భావోద్వేగంగా ఉండటం ఈ వారం మీ సంబంధాన్ని బలోపేతం చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో, అదృష్టవంతులలో మీరూ ఒకరైతే మీ ప్రేమ పెళ్లిగా కూడా మారవచ్చు. అన్ని రకాల వివాదాల తర్వాత కూడా, మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత విశ్వసనీయ వ్యక్తి అని మీరు గ్రహిస్తారు.
Capricorn Zodiac
మకరం : శుక్రుడి కారణంగా ఈ వారం మీరు పనుల్లో బిజీగా ఉండడంతో మీ భాగస్వామితో హృదయపూర్వకంగా మాట్లాడలేరు. దీని కారణంగా వారిలో చిరాకు పెరుగుతుంది. ఈ సమయంలో దీని సరిదిద్దుకునే అవకాశాలొచ్చినా మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు. ఈ వారం మీ జీవిత భాగస్వామి మీతో చాలా కాలంగా నిరాశకు గురవుతున్నారనే ఆలోచన మీలో కలుగుతుంది. కానీ మీరు దీన్ని ఆలస్యంగా గ్రహించారు, కాబట్టి మీరు వ్యతిరేక పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
Aquarius
కుంభం : మీ రాశి నుండి మొదటి ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల, మీ ప్రేమ జీవితం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమనావలో మీ భాగస్వామి ప్రేమలో మునిగితేలతారు. మీ ప్రేమ జీవితం బలంగా ముందుకు సాగుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ వారం మీ వైవాహిక జీవితం అంతకు ముందు బాగాలేదన్న విషయాన్ని గ్రహిస్తారు. మీ అంచనాలకు మించి మీ భాగస్వామి మీ కోసం ఏదైనా చేసినప్పుడు మీరు దానిని గ్రహిస్తారు. కాబట్టి ఈ సమయాన్ని ఆలోచిస్తూ వృధా చేసుకోకుండా, మీ భాగస్వామితో కలిసి ఆనందించండి.
Pisces Zodiac
మీనం : మీ భాగస్వామి తన హృదయంలోని భావాల్ని నోరువిప్పి చెప్పరనేది ఫిర్యాదు అయితే.. అది పూర్తిగా మర్చిపోండి. ఎందుకంటే ఈ వారం మీ భాగస్వామి మీ మీద తనకున్న ప్రేమను మనసువిప్పి మాట్లాడతారు. దీనివల్ల మీ ప్రేమ బంధం బలపడుతుంది. మీరు ఒకరికొకరు దగ్గరవుతారు. ఈ వారం మీ వైవాహిక జీవితానికి సంబంధించిన మధురస్మృతులు తలుచుకుని మీరు భావోద్వేగానికి గురవుతారు. దీన్నిచూసి మీ భాగస్వామి కూడా మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు. ప్రతి సాయంత్రం మీ భాగస్వామితో గడపడానికి ఇష్టపడతారు.