MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • నవంబర్ 2021: ఈ నెలలో అన్ని రాశుల ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసా..?

నవంబర్ 2021: ఈ నెలలో అన్ని రాశుల ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసా..?

మీరు కొంతకాలంగా ఎవరిపైన అయినా మనసు పారేసుకుంటే.. వారితో ఈ నెల కొత్త సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. అయితే.. వారితో రిలేషన్ జీవితాంతం కొనసాగాలి అంటే.. మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.

3 Min read
Author : ramya Sridhar
Published : Nov 01 2021, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమ ఉండాలని కోరుకుంటారు. అయితే.. ప్రేమ జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. మనకు కావాల్సిన విధంగా ఉంటే.. అది ప్రేమ ఎలా అవుతుంది. జీవితంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో.. ప్రేమ విషయంలోనూ అంతే. మరి.. ఈ ప్రేమ జీవితం..  ఈ నవంబర్ నెలలో ఎవరికి ఎలా మారనుంది..? జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు  చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..
మేష రాశివారికి ఈ నవంబర్ నెలలో కొత్త ప్రేమ తలుపు తట్టే అవకాశం ఉంది. అంటే.. ఎవరైనా మీ జీవితంలోకి రావాలని కోరుకోవచ్చు. అయితే.. ఆ ప్రేమను ఆహ్వానించే మంచి మూడ్ లో మీరు ఉండకపోవచ్చు. మీరు ఏదైనా ఆందోళనలో లేదంటే.. మరేదైనా పర్సనల్ పనిలో నిమగ్నమై ఉండటం వల్ల.. ఆ ప్రేమను స్వీకరించకపోవచ్చు.

313

2.వృషభ రాశి..
నవంబర్ నెలలో మీరు మీ ప్రేమ జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపకపోవచ్చు. మీరు ఎక్కువగా గందరగోళానికి గురవుతారు. ప్రేమ విషయంలో ఏదైనా చేయాల్సి వచ్చినా... మీకు ఉన్న బద్దకం మిమ్మల్ని ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంది.

413

3.మిథున రాశి..
మిథున రాశివారు.. ఈ నెలలో తమ జీవిత భాగస్వామి కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీరు మీ భాగస్వామి కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రయత్నాలను మీ భాగస్వామి గుర్తిస్తారు. మీ పార్ట్ నర్ తో మీ రిలేషన్ ఎక్కువగా బలపడుతుంది.

513

4.కర్కాటక రాశి..
మీరు కొంతకాలంగా ఎవరిపైన అయినా మనసు పారేసుకుంటే.. వారితో ఈ నెల కొత్త సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. అయితే.. వారితో రిలేషన్ జీవితాంతం కొనసాగాలి అంటే.. మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.

613

5.సింహ రాశి..
 ఈ నెలలో సింహరాశివారికి ఎక్కువగా హార్ట్ బ్రేక్స్ జరిగే అవకాశం ఉంది. మీరుకావాలని కోరుకునే ప్రేమ మీకు దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు కోరుకునే వ్యక్తి కనీసం మీతో మాట్లాడటం కూడా మానేసే అవకాశం ఎక్కువగా ఉంది.
 

713

6.కన్య రాశి..
ప్రేమ విషయంలో ఈ నెల కన్యా రాశివారికి ఎక్కువగా విచారం మిగలనుంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఈ రాశివారు ఉండిపోవాల్సి వస్తుంది. అయితే.. మీరు ప్రేమించిన వ్యక్తి మాత్రం.. గతంలో తమ గుండె కు తగిలిన గాయం గురించి ఆలోచిస్తూ మీరు చేసే ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు.

813

7.తుల రాశి..
ఈ నెలలో  ఈ రాశివారు తమ పార్ట్ నర్ ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి.. వారిని కంట్రోల్ చేయడానికి సాధ్యమైనన్ని ప్రయత్నాలు  చేస్తారు. అందుకోసం ఈ రాశివారు ఎదుటివారిని మానిప్యూలేట్ చేయడం లాంటివి కూడా చేస్తుంటారు. అయితే.. తాము చేసే పనిని తమలో తామే సీక్రెట్ గా ఉంచుకుంటారు. ఎవరితోనూ పంచుకోరు.

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు.. ఈ నవంబర్ నెలలో తమ జీవిత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. మీ భాగస్వామి కూడా మీతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటారు. వీరికి ఈ నెలంతా చాలా బాగా జరుగుతుంది.

1013

9. ధనస్సు రాశి..
ఈ రాశివారి ప్రేమ జీవితం నవంబర్ నెలలో గందరగోళంలో పడే అవకాశం ఎక్కువగా కనపడుతోంది.  మీరు ఆనందంగా ఉండాలని అనుకున్నా.. గతంలో చేసిన పొరపాట్లు.. ఇప్పుడు సమస్యగా మారే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఈ నెలలో ఎవరి చేతిలో ముఖ్యంగా ప్రేమ విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి.

1113

10.మకర రాశి..
ఈ నెలలో మకరరాశి వారు ప్రేమ విషయంలో ఊహించని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తమ ప్రేమ బంధాన్ని కొనసాగించే అవకాశం ఉంది.. లేదంటే.. ఆ బంధానికి పులిస్టాప్ పెట్టి.. మరో కొత్త వ్యక్తితో బందంలోకి అడుగుపెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

1213

11.కుంభ రాశి..
మీరు మీ భాగస్వామికి కొంత అన్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి, అది సంబంధాన్ని నాశనం చేయగలదు. మీరు మీ ప్రవర్తనపై చెక్ పెట్టాలని ,అనుచితంగా ప్రవర్తించకుండా చూసుకోవాలి.

1313

12.మీన రాశి..
నవంబర్ నెలలో మీన రాశివారికి.. మీ ప్రేమ జీవితానికి సంబంధించిన ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీరు ,మీ భాగస్వామి ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవ్వడానికి చొరవ తీసుకుంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved