వృశ్చిక రాశితో లవ్ లైఫ్... ఏ రాశివారు వీరికి పర్ఫెక్ట్ మ్యాచ్..?
ఈ రాశివారు తమను ఎవరైనా మోసం చేస్తే అసలు సహించరు. వీరు తాము ప్రేమించిన వారితో చాలా స్నేహంగా ఉంటారు. వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు. మరి ఈ రాశి వారికి పర్ఫెక్ట్ మ్యాచ్ గా ఏ రాశివారు సెట్ అవుతారో ఓసారి చూద్దాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Scorpio
వృశ్చిక రాశివారు ప్రేమ విషయంలో చాలా తెలివిగా ఉంటారు. తమ జీవితంలో అన్ని కష్ట సుఖాల్లోనూ.. అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉండేవారు తమ జీవితంలోకి రావాలని వీరు కోరుకుంటారు. ఈ రాశివారు తమను ఎవరైనా మోసం చేస్తే అసలు సహించరు. వీరు తాము ప్రేమించిన వారితో చాలా స్నేహంగా ఉంటారు. వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు. మరి ఈ రాశి వారికి పర్ఫెక్ట్ మ్యాచ్ గా ఏ రాశివారు సెట్ అవుతారో ఓసారి చూద్దాం..
మేషంతో...
మేష రాశివారితో వృశ్చిక రాశివారు జీవితం మొదలుపెడితే..వీరి బంధం సాధారణంగా సాగుతుంది.అద్భుతంగా ఉంటుందని చెప్పలేం కానీ.. మరీ గొడవలు లాంటివి మాత్రం ఎక్కువగా జరగకపోవచ్చు. ఒకరితో మరొకరు సరదాగా ఉంటారు. అయితే.. వీరు తమ మధ్యలోకి గతాన్ని తీసుకురాకపోవడమే మంచిది. అది తీసుకువస్తే.. ఇద్దరి మధ్య సమస్యలు మొదలౌతాయి. అది రానంత వరకు వీరి జీవితం సజావుగానే సాగుతుంది.
మొత్తంగా ఈ రెండు రాశుల కంపాటబులిటీ: 3
సెక్స్: 4
ప్రేమ: 5
కమ్యూనికేషన్: 3
వృషభంతో..
వృశ్చిక రాశి వారు వృషభ రాశివారితో జీవితం మొదలుపెడితే... జీవితంలో ఎన్నడూ చూడనంత ఆనందాన్ని పొందుతారు. అయితే... ఏదీ తొందరపడి చేయకూడదు. నిదానంగా లైఫ్ స్టార్ట్ చేయాలి. ఈ రెండు రాశుల ప్రేమ జీవితం బాగుంటుంది. ఒకరికొసం మరొకరులా జీవిస్తారు.
మొత్తం: 4
సెక్స్: 3
ప్రేమ: 2
కమ్యూనికేషన్: 4
మిథున రాశి తో..
మిథున రాశి, వృశ్చిక రాశుల అభిరుచులు కలుస్తాయి. వీరు ఉత్సాహంగా గడుపుతారు. అయితే.. వీరు ఒకరితో మరొకరు నిజాయితీగా ఉండే అవకాశం చాలా తక్కువ. ఎక్కువ డ్రమాటిక్ గా ఉంటారు. రియలిస్టిక్ గా ఉండదు. కాబట్టి.. ఈ రెండు రాశుల వారు కలిసి జీవితం ప్రారంభించాలి అనుకుంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించడం ఉత్తమం.
మొత్తం: 3
సెక్స్: 4
ప్రేమ: 4
కమ్యూనికేషన్: 5
కర్కాటక రాశి తో..
ఈ రెండు రాశులు కలిసి జీవితం ప్రారంభిస్తే.. భయం, జీవితం పట్ల జాగ్రత్త ఎక్కువ పెట్టి బతకాల్సి ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీరు తమ రిలేషన్ బలంగా ఉండాలంటే.. ఒకరిపై మరొకరు పట్టు కోల్పోకూడదు. ఒకరిపై మరొకరు క్రూరంగా ప్రవర్తిస్తే.. భయంతో స్వేచ్ఛ కోసం పారిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ రెండు కలిసి జీవితం ప్రారంభించాలంటే ఆలోచించుకోవాలి.
మొత్తం: 3
సెక్స్: 4
ప్రేమ: 3
కమ్యూనికేషన్:3
సింహ రాశితో..
ఈ రెండు రాశులు కలిసి జీవితం ప్రారభింస్తే.. ఒకరికి మరొకరు హాని కలిగించరు. అలా అని.. ఒకరిని చూసి మరొకరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే.. వీరికి నిర్ధిష్ట మార్గం అనేది ఉండదు. దాని వల్ల సమస్యలు రావచ్చు. అయితే.. వీరి మధ్య నిజమైన ప్రేమ కనుక ఉంటే.. అది ఎలాంటి సమస్యలను అయినా పరిష్కరించగలదు.
మొత్తం: 3
సెక్స్: 4
ప్రేమ: 4
కమ్యూనికేషన్: 5
కన్య రాశితో...
ఈ రెండు రాశుల కాంబినేషన్ అంత అద్భుతంగా ఉంటుందని చెప్పలేం. ప్రతికూలతలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఒకరి సుఖం కోసం మరొకరు ఆలోచించరు. కలిసి బతకాలంటే..ఒకరి కోసం మరొకరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీరిద్దరూ కలిసి జీవితం మొదలుపెట్టడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి.
మొత్తం: 3
సెక్స్: 5
ప్రేమ: 5
కమ్యూనికేషన్: 3
తుల రాశితో...
ఈ రెండు రాశుల కాంబినేషన్ కూడా అస్సలు సెట్ అవ్వదు. ఎక్కువ అడ్డంకులు ఎదురౌతాయి. వృశ్చిక రాశి ఆలోచనలకు తుల రాశి సెట్ అవ్వదు. సెట్ అవ్వాలి అంటే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే.. ఒకరి కోసం మరొకరు ఆలోచిస్తే.. కలిసి బతకొచ్చు. అది కూడా చాలా అద్భుతాలు జరిగితే.. వీరి బంధానికి అవకాశం ఉంటుంది. కాబట్టి.. స్వచ్చమైన ప్రేమ అయితేనే ముందుకు సాగండి.
మొత్తం: 3
సెక్స్: 2
ప్రేమ: 3
కమ్యూనికేషన్: 2
వృశ్చిక రాశితో..
ఇద్దరూ ఒకే రాశికి చెందిన వారు కావడం తో ఆలోచనలు ఒకటిగా ఉంటాయి. ఎక్కువ సమస్యలు రాకపోవచ్చు. కాబట్టి వీరి బంధం బలంగానే ఉంటుంది. వీరు తొందరగా ఏకమౌతారు. అభిప్రాయ బేధాలు ఎక్కువగా రావు.
మొత్తం: 5
సెక్స్: 5
ప్రేమ: 4
కమ్యూనికేషన్: 3
ధనస్సు రాశితో..
ధనస్సు రాశితో వృశ్చిక రాశి బాగానే సెట్ అవుతుంది. వీరు కలిస్తే అన్ని సమస్యలను పరిష్కరించగలరు. జీవితాంతం కలిసి ఉండగలరు. వీరికి జీవితం పట్ల ప్రేమ ఎక్కువ. అందుకే.. దానిని కాపాడుకునేందుకు ముందుంటారు. ఆనందంగా ఉండటానికి ఏదైనా చేస్తారు. వీరికి ధైర్యం కూడా ఎక్కువ. సమస్యలను చూసి భయపడరు.
మొత్తం: 5
సెక్స్: 4
ప్రేమ: 3
కమ్యూనికేషన్: 4
మకర రాశితో..
వృశ్చిక రాశి వారితో మకర రాశివారి లైఫ్ బాగుంటుంది. ఒకరికి మరొకరు రక్షణగా ఉంటారు. శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. వీరితో ఉంటే సురక్షితంగా ఉన్నామనే భావన మీకు కలుగుతుంది. ఎమోషనల్ బాండింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకరికి మరొకరు బలంగా మారతారు. వీరి బంధం బాగుంటుంది.
మొత్తం: 4
సెక్స్: 3
ప్రేమ: 5
కమ్యూనికేషన్: 3
కుంభ రాశితో..
వారు లేకుండా జీవితం లేదని మీరు భావిస్తారు, కానీ మీ భావోద్వేగాలను వ్యక్తీకరించడం కూడా చాలా కష్టం. ఖచ్చితమైన సమతుల్యత అవసరం అయితే, కోపం లేదా నిందలు లేకుండా తక్కువ సమయాలను అంగీకరించడం నేర్చుకోండి మీరు వారి మద్దతును కనుగొన్నప్పుడు మీరు ప్రకృతితో సామరస్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తంమీద, మారుతున్న కాలాలకు అనుగుణంగా మారడం నేర్చుకోండి. అప్పుడు వీరి బంధం బాగుంటుంది.
మొత్తం: 5
సెక్స్: 4
ప్రేమ:3
కమ్యూనికేషన్: 4
మీన రాశితో..
ఈ రెండు రాశుల కాంబినేషన్ తో జీవితంలో కల్లోలం ఉంటుంది. ఈ రెండు రాశుల కాంబినేషన్ వారికి నచ్చినా.. ఎదుటివారికి నచ్చకపోవచ్చు. చాలా మందిని ఎదురించాల్సిన అవసరం ఉంది.
మొత్తం: 4
సెక్స్: 3
ప్రేమ: 5
కమ్యూనికేషన్: 3