MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. సింహ రాశి జాతకం

Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. సింహ రాశి జాతకం

స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో సింహ రాశివారికి గతంలో చేసిన విధంగా ఇప్పుడు చేపట్టిన పనులు చేయలేకపోవడంతో  మీరు పనిచేసే ప్రదేశంలో నిరాదరణకు గురవుతారు. అయితే జూలై నుంచి మళ్లీ శని గోచారం అనుకూలంగా రావడం వలన వృత్తిలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. 

5 Min read
ramya Sridhar
Published : Mar 31 2022, 10:07 AM IST | Updated : Apr 01 2022, 08:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Leo

Leo

ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు  గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com

28
Leo Zodiac

Leo Zodiac

సింహ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది,  అలాగే ద్వితీయార్ధంలో కొన్ని ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

38
Leo

Leo

ఉద్యోగం
వృత్తి పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది.  సంవత్సరం ప్రథమార్ధంలో వృత్తిలో అభివృద్ధి చూడగలుగుతారు.  శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.  మీరు చేసే పనులకు మీ పై అధికారుల మరియు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి.  మీ ఆలోచనలు,  ప్రణాళికలు మీ వృత్తిలో అభివృద్ధికి కారణం అవుతాయి. మీకు చెడు చేయాలనే ఆలోచన ఉన్న వారు కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండి పోతారు. ఈ సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం, సంవత్సరం మధ్యలో మరియు చివరలో శనిగోచారం అనుకూలంగా లేకపోవటం వలన మీ పై అధికారులకు  గతంలో మీపై ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది.  మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావడం సమయానికి పనులు పూర్తి కాక పోవడం వలన మీ పై అధికారుల కోపానికి గురవుతారు.  అంతేకాకుండా రావలసిన ప్రమోషన్ కానీ,  వృత్తిలో మార్పు ఆగిపోవడం లేదా వాయిదా పడడం జరుగుతుంది. మీపై ఈర్ష్య కారణంగా సహోద్యోగులు లేదా రహస్య శత్రువులు మీ గురించి చెడుగా ప్రచారం చేయడం కానీ మీకు హాని చేయాలని చూడటం కానీ చేసే అవకాశం ఉంటుంది.  గతంలో చేసిన విధంగా ఇప్పుడు చేపట్టిన పనులు చేయలేకపోవడంతో  మీరు పనిచేసే ప్రదేశంలో నిరాదరణకు గురవుతారు. అయితే జూలై నుంచి మళ్లీ శని గోచారం అనుకూలంగా రావడం వలన వృత్తిలో ఉండే సమస్యలు తొలగిపోతాయి.  అంతేకాకుండా ఈ సమయంలో వేరే ప్రదేశంలో పని చేయడానికి వెళ్ళవలసి వస్తుంది.  మీకు ఇష్టం కాకపోయినప్పటికీ ఈ పని చేయవలసి వస్తుంది. వృత్తిలో మార్పు కోరుకునేవారు ఆచితూచి అడుగేయటం మంచిది.  ముఖ్యంగా ఏప్రిల్  మరియు జూలై మధ్యలో అలాగే జనవరి తర్వాత  వృత్తి విషయంలో  ఎటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.  ఈ సంవత్సరం పదోన్నతి కారణంగా పని ఒత్తిడి పెరగడమే కాకుండా ఆ పదోన్నతి ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడేదిగా ఉండదు.  అయితే ఈ మార్పు భవిష్యత్తుకు సహాయకారిగా  ఉంటుంది. సంవత్సరమంతా  కేతు గోచారం మూడవ ఇంటిలో  అనుకూలంగా ఉండటం వలన మీకు వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు వస్తాయి.  అలా వచ్చిన అలా వచ్చిన సమస్యలను  ధైర్యంగా ఎదుర్కొన గలుగుతారు. 

48
Leo

Leo

కుటుంబం
 ఈ సంవత్సరం కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం, సంవత్సర ఆరంభంలో మరియు అంత్యంలో శనిగోచారం అనుకూలంగా లేకపోవటం వలన కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడటం లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం జరగవచ్చు.  మానసికంగా మీలో అశాంతి,  అపనమ్మకం ఎక్కువ అవుతాయి దాని కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.  మీ మాటకు విలువ ఇవ్వడం లేదనే భావన మీ లో ఎక్కువ అవుతుంది. దాని కారణంగా మీ కుటుంబ సభ్యుల పై ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావటం వలన ఇంటిలో ప్రశాంతత లోపిస్తుంది. ఈ సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండి మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను  పొందే అవకాశం ఉంటుంది. 
జులై తర్వాత గురు గోచారం అనుకూలంగా లేనప్పటికీ,  శని గోచారం బాగుండటం వలన కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి.   మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి లభిస్తుంది.  అలాగే మీ వారసత్వ  ఆస్తులు కానీ,  కోర్టు తదితర వివాదాల కారణంగా ధనా దాయం కానీ లభిస్తుంది. మీ సంతానం కారణంగా మీకు ఆనందం లభిస్తుంది. వారు వారి, వారి రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. 

58
leo

leo

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఆర్థికంగా సమస్యాత్మకంగా ఉంటుంది. ఆదాయమున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండటం వలన అప్పు చేయాల్సివచ్చే అవకాశముంటుంది.. అయితే ఆరవ ఇంటిలో శని గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో గతంలో మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడమే కాకుండా మీరు చెల్లించాల్సిన  బ్యాంకు లోన్ లు కానీ,  అప్పులు కానీ తిరిగి చెల్లించ గలుగుతారు.  ఏప్రిల్ -  జూలై మధ్యలో తిరిగి సంవత్సరాంతంలో శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి.  చెల్లించవలసిన దానికంటే ఎక్కువ చెల్లించాల్సి రావడం అలాగే ఫైన్ లు టాక్స్ ల రూపంలో కూడా డబ్బులు చెల్లించాల్సి రావడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురికావలసి వస్తుంది.  ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువు గోచారం ఆర్థిక విషయాలలో  జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.  ఈ సమయంలో  తొందరపడి పెట్టుబడులు పెట్టడం చేయకండి.  ఇప్పుడు వచ్చే అవకాశాల్లో చాలా మటుకు నష్టం చేసేవే అవుతాయి తప్ప మీకు ఆర్థికంగా లాభం చేకూర్చవు.  వీలైనంతవరకు ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. 

68
Leo

Leo

ఆరోగ్యం
 సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఈ విషయంలో సామాన్యంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు  గోచారం, సంవత్సర ఆరంభంలో శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కాలేయం,  ఎముకలు,  వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది.  ఇవే కాకుండా మూత్రపిండాలు మరియు  గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం.  జూలై నుంచి మళ్ళీ శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.  అష్టమ గురువు కారణంగా మీ  ఆహార అలవాట్లను,  జీవనశైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు మానసిక ఒత్తిడి తగ్గడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి యోగా, ధ్యానం లాంటి వాటిని ప్రతిరోజు చేయడం మంచిది. 

78
Leo

Leo

వ్యాపారం మరియు స్వయం ఉపాధి
 ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అంతగా అనుకూలించదు.  ఈ సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి.  మీ వ్యాపార వలన భాగస్వామి వలన కాని లేదా గతంలో చేసిన పెట్టుబడుల్లో నష్టం  ఏర్పడడం వలన కానీ వ్యాపారంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా   సంవత్సర ఆరంభంలో శని  గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో నష్టపోవడం కానీ,  తక్కువ లాభంతో వ్యాపారం చేయవలసి రావడం గానీ జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకూ కొత్తగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది.  అంతే కాకుండా గతంలో మీ వ్యాపార భాగస్వామి గా ఉండి ఆ తర్వాత మాని వేసిన వారి నుంచి ఏవైనా న్యాయపరమైన చిక్కులు గాని ఆర్థికపరమైన చిక్కులు కానీ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విషయంలో పంతానికి పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించు కోవడం మంచిది. అలా కాకుండా వివాదాన్ని పెంచుకున్నట్లయితే  మీకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. 
కళాకారులు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవితం సాధించేవారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన మీ ప్రతిభకు తగిన అవకాశాలు రాక కొంత ఇబ్బందిపడే అవకాశముంటుంది. అంతే కాకుండా వచ్చిన అవకాశాలు కొని చేజారిపోవడం కానీ, తక్కువ డబ్బులకు చేయాల్సి రావడం గానీ జరగవచ్చు. వీలైనంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వచ్చే ప్రతి సమస్య మీ ప్రతిభను మరింత పదునుపెట్టి మీలో ఉన్న అలసత్వాన్ని తొలగించటానికే అని అర్థంచేసుకోవటం మంచిది.

88
Asianet Image

పరిహార క్రియలు
 ఈ సంవత్సరం, సింహ రాశిలో జన్మించిన వారికి గురువు మరియు శని అనుకూలంగా ఉండరు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు చేసుకోవాల్సి  ఉంటుంది.  సంవత్సరమంతా గురు గోచారం బాగుండదు కాబట్టి  అష్టమ స్థానంలో  సంచరించే గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ,  గురు చరిత్ర పారాయణం చేయడం కానీ మంచిది.   అష్టమ గురువు ఇచ్చే  చెడు ఫలితం అధికంగా ఉన్నట్లయితే 16,000 సార్లు గురు మంత్ర జపం చేయడం కానీ లేదా గురు గ్రహ శాంతి హోమం జరిపించడం కానీ మంచిది.  ఈ సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో శని ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం చేయటం కానీ హనుమాన్ స్తోత్రం పారాయణం చేయడం కానీ మంచిది. దీని వలన శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది . మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు  ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది.  పైన చెప్పిన పరిహారములు మీ శక్తి,  భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ ఈ పరిణామాలతో పాటుగా తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

About the Author

ramya Sridhar
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఉగాది
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved