Mars Rahu Conjunction: త్వరలో రాహువు వల్ల విష యోగం.. ఈ 3 రాశులకు బోలెడు కష్టాలు
Mars Rahu Conjunction కుజ గ్రహం రాహువుతో కలిసి విష యోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఫిబ్రవరిలో ఈ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పకపోవచ్చు. ఈ యోగం ముగిసేవరకు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది.

కుజ రాహు సంయోగంతో విషయోగం
గ్రహాలలో కుజుడు, రాహువును చెడ్డగ్రహాల జాబితాలోనే పరిగణిస్తారు. వీరిద్దరూ మంచి స్థానంలో ఉంటే ఫర్వాలేదు… ఈ రెండు గ్రహాలు చెడు స్థానంలో ఉంటే మాత్రం ఆ రాశి వారికి కష్టాలు తప్పవు. త్వరలో అలాంటి చెడు యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల కొన్ని రాశుల వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుజుడు ఫిబ్రవరిలో 23 ఉదయం 11:57 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ 2, 2026 వరకు అక్కడే ఉంటాడు. అప్పటికే కుంభ రాశిలో రాహువు ఉంటాడు. రాహువుతో కలిసి కుజుడు విషయోగాన్ని కలయిక విష యోగాన్ని సృష్టిస్తుంది.
మేష రాశి
మేషరాశి వారికి ఈ విష యోగం ఏమాత్రం మంచిది. వీరికి ఈ సమయంల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో 11వ లాభ గృహంలో కుజ రాహువుల కలయిక జరుగుతుంది. దీనివల్ల వారు అనుకున్న పనులు జరగవు. వారి కోరికలు కూడా నెరవేరకపోవచ్చు. చేస్తున్న పనిలో, ఉద్యోగంలో సమస్యలు, ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ధనూ రాశి
ధనుస్సు రాశి వారికి విష యోగం వల్ల మేలు జరగదు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి 3వ ఇంట్లో కుజ రాహువుల కలయిక జరగబోతోంది. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ధనుస్సు రాశి వారిపై ఈ యోగం ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ఒత్తిడి, అనారోగ్యం, అనవసర గందరగోళం వంటివి ఏర్పడవచ్చు. మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి విషయోగం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రాశి వారి 2వ ఇంట్లో విష యోగం భారీగా ప్రభావాన్ని చూపిస్తుంది. వీరికి ఈ యోగం వచ్చాక ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడుల పెట్టే విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు… వైద్య ఖర్చులు పెరగవచ్చు. కుటుంబంలో గొడవలు పెరిగే అవకాశం ఉంది.

