ఈ రాశికి చెందిన పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువ..!
నాయకత్వం వహించడం అంత సులువైన పని కాదు. దానికి చాలా సామర్థ్యం ఉండాలి. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులకు చెందిన పిల్లలకు నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం.

astro kids
నాయకత్వ లక్షణాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి. చాలా మంది ఎదుటివారిని ఫాలో అవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు ఉండటం చాలా అరుదు. నాయకత్వం వహించడం అంత సులువైన పని కాదు. దానికి చాలా సామర్థ్యం ఉండాలి. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులకు చెందిన పిల్లలకు నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం.
1.మేష రాశి..
ఈ రాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. వీరు ఎదుటివారిని ఎక్కువగా ప్రేమిస్తారు. వీరికి ఇతరులపై ఆధారపడటం ఇష్టం ఉండదు. తమ సొంత మార్గాన్ని ఏర్పరుచుకుంటారు. వీరు చాలా చురుకుగా ఆలోచిస్తారు. ఏ నిర్ణయమైనా చాలా తెలివిగా తీసుకుంటారు. ఈ రాశివారిని ఫాలో అవ్వడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు.
2.సింహ రాశి..
ఈ రాశివారిని చాలా మంది అనుసరిస్తారు. వీరికి ఎక్కడకు వెళ్లినా గౌరవం చాలా దక్కుతుంది. సింహ రాశివారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వచ్చేస్తాయి. వీరికి బాద్యతలు స్వీకరించమని ఎవరూ చెప్పక్కర్లేదు. వీరికి వీరే బాధ్యతలు తీసుకుంటారు. మీ పిల్లలు సింహ రాశివారికైతే.. వారి నాయకత్వాన్ని మీరు చూస్తారు.
3.కన్య రాశి..
ఈ రాశివారు చాలా కష్టపడి పనిచేస్తారు. వారు చేసే పనిని బట్టి.. వారి విలువను వారు అంచనా వేసుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనూ అసంపూర్ణంగా ఉండటం వీరికి నచ్చదు. నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువ. ఇతరులను నిర్దేష మార్గంలో నడిపించడానికి ఎప్పుడూ ముందుంటారు.
4.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి ఇతరులు తమను కంట్రోల్ చేయడం వీరికి నచ్చదు. ఇతరులు తమను కంట్రోల్ చేస్తే.. తమపై తమకు కంట్రోల్ పోతుందని వారు భయపడిపోతుంటారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాయకత్వం వహించగలరు. చిన్నతనం నుంచే వారు తమ లక్షణాలను బయటపెడతారు.
5.మకరరాశి..
ఈ రాశివారికి ఏ పనైనా చేయకుండా వదిలిపెట్టరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా ఉండరు. డబ్బు, బాధ్యత, అధికారం, చిత్త శుద్ది చాలా ఎక్కువ. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఉత్తమమైన వాటిని చేయడానికి ముందుంటారు. వీరిని ఫాలో అవుతారు.