Ketu Transit: కేతువు సంచారం.. ఈ 3 రాశుల వారి జీవితం అద్భుతంగా మారడం పక్కా!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు త్వరలో పూర్వఫల్గుణి నక్షత్రంలో పాదం మారనున్నాడు. ఈ మార్పు కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వనుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరగడంతోపాటు సంపద కలిసిరానుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా..

కేతు సంచారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కేతువు ఒక ఛాయా గ్రహం. దీని కదలిక వ్యతిరేక దిశలో ఉంటుంది. అందుకే దీని ప్రభావం జీవితంలో అకస్మాత్తుగా కనిపిస్తుంది. ప్రస్తుతం కేతువు పూర్వఫల్గుణి నక్షత్రం రెండో పాదంలో ఉన్నాడు. జనవరి 25న మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. కేతువు పాద మార్పు కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని శుభ ఫలితాలు ఇవ్వనుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాల్లో మంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా..
మేష రాశి
కేతు నక్షత్ర పాద మార్పు.. మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. బాధ్యతలు పెరగవచ్చు. కుటుంబ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. కొత్త అవకాశాలు రావొచ్చు. వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో ఉన్న సమస్యలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఉంటుంది.
కన్య రాశి
కేతువు అనుగ్రహంతో కన్య రాశి వారికి ధన లాభం కలుగుతుంది. అంతేకాదు బంధువుల నుంచి ఆస్తులు లభించే అవకాశం బలంగా ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు అనుకున్న స్థాయిలో రాణిస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి కేతు నక్షత్ర పాద మార్పు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సులభంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా చకచకా పూర్తిచేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అంతేకాదు ప్రమోషన్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి.

