MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Venus Ketu Conjunction: కేతు, శుక్రుల దయతో ఆగస్టు వరకు ఈ 5 రాశులవారికి తిరుగేలేదు!

Venus Ketu Conjunction: కేతు, శుక్రుల దయతో ఆగస్టు వరకు ఈ 5 రాశులవారికి తిరుగేలేదు!

Venus Ketu Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు, కేతువు రెండూ శక్తివంతమైన గ్రహాలు. వీటి కలయిక చాలా ముఖ్యమైనది. త్వరలో సింహరాశిలో శుక్ర, కేతువుల సంయోగం జరగనుంది. దానివల్ల కొన్ని రాశులవారి తలరాత మారనుంది. మరి ఆ అదృష్ట రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : May 27 2026, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సింహ రాశిలో శుక్ర కేతువుల సంయోగం
Image Credit : Asianet News

సింహ రాశిలో శుక్ర-కేతువుల సంయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు ప్రస్తుతం సింహరాశిలో ఉంది. డిసెంబర్ 5 వరకు అక్కడే సంచరిస్తుంది. ఇదే సమయంలో, శుక్రుడు జూలై 4న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 1 వరకు అక్కడే ఉంటాడు. దానివల్ల సింహరాశిలో శుక్ర-కేతువుల కలయిక జరుగుతుంది. దాని ప్రభావం 5 రాశుల వారిపై ఉంటుంది. మరి ఆ రాశులేవో, వారికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశివారికి శుక్ర, కేతువుల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి. 

Related Articles

Related image1
Dream Meaning: కలలో కొత్త దుస్తులు కనిపిస్తే అర్థం ఏంటి? నిజ జీవితంలో ఏమవుతుంది?
Related image2
June Astrology: 12 ఏళ్ల తర్వాత మహా సంయోగం.. జూన్‌లో 4 రాజయోగాలు, ఈ 4 రాశులకు పండగే!
36
కన్య రాశి
Image Credit : Pixabay

కన్య రాశి

శుక్ర, కేతువుల దయతో కన్య రాశివారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు రావడం మొదలవుతుంది. ఎప్పటినుంచో కొనాలి అనుకున్న కొన్ని వస్తువులు కొంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి.

46
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశివారికి శుక్ర, కేతువుల కలయిక మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో చకచకా పూర్తవుతాయి.

56
ధనుస్సు రాశి
Image Credit : Pixabay

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారికి ఈ సమయంలో దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  

66
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశివారికి శుక్ర, కేతువుల కలయిక వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది. దీర్ఘకాలిక అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Related Stories
Recommended image1
Dream Meaning: కలలో కొత్త దుస్తులు కనిపిస్తే అర్థం ఏంటి? నిజ జీవితంలో ఏమవుతుంది?
Recommended image2
June Astrology: 12 ఏళ్ల తర్వాత మహా సంయోగం.. జూన్‌లో 4 రాజయోగాలు, ఈ 4 రాశులకు పండగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved