Jupiter transit: బృహస్పతి సంచారంతో ఆగస్టులో ఈ మూడు రాశుల వారికి ధనయోగం
బృహస్పతి ఆగస్టులో నక్షత్రాలను రెండుసార్లు మార్చుకోబోతున్నాడు. అతని సంచారం వల్ల మూడు రాశుల వారికి అపారమైన లాభాలు కలుగుతాయి.

బృహస్పతి సంచారంతో ఆగస్టులో
గ్రహాలలో బృహస్పతి ఎంతో ముఖ్యమైనది. బృహస్పతి నక్షత్ర సంచారం, నక్షత్ర పాద మార్పు కూడా ఎన్నో ప్రభావాలను కలిగిస్తుంది. బృహస్పతి ఆగస్టు 12 వరకు ఆద్ర నక్షత్రంలో ఉంటాడు. ఆగస్టు 13న పునర్వసు నక్షత్రంలోని మొదటి పాదం లోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 30 వరకు అక్కడే ఉండి ఆ తర్వాత పునర్వసు నక్షత్రంలోని రెండవ పాదంలోకి ప్రవేశిస్తాడు.
గురువు వల్ల జరిగే మార్పులు
బృహస్పతి నక్షత్ర మార్పు, నక్షత్రంలోని ఈ పాదాల మార్పు అనేవి కొన్ని రాశి చక్రాలపై తీవ్రమైన ప్రభావాలను చూపిస్తాయి. ముఖ్యంగా ఆగస్టులో గురువు సంచారం వల్ల మూడు రాశుల వారికి శుభకరమైన మార్పులు ఏర్పడతాయి. వివాహం, విద్యా, వృత్తి, ఆర్థిక స్థితి అన్నింటిలో సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి. అన్ని వైపుల నుంచి వీరికి ప్రయోజనాలు కలుగుతాయి. ఆ మూడు రాశి చక్రాలు ఏవో తెలుసుకోండి.
మేషరాశి
మేషరాశి వారికి ఆగస్టులో అంతా మేలే జరుగుతుంది. గురువు నక్షత్ర స్థితిలో మార్పు వలన వీరికి ఎన్నో పనులు పూర్తవుతాయి. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో కూడా లాభదాయకమైన మార్గాలు ఏర్పడతాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికంగా మీకు గౌరవం పెరుగుతుంది. కుటుంబం మీద ప్రేమను చూపిస్తుంది. జీవితంలో సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురువు నక్షత్ర స్థితిలో మార్పు వలన శుభ ఫలితాలు కలిగి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంట్లో మీరు కొన్ని శుభకార్యాలు చేయవచ్చు. పెండింగ్లో ఉండిపోయిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. సంబంధిత సమస్యలు కూడా తొలగిపోయి వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కెరీర్లో ఉన్న సమస్యలు కూడా చాలా వరకు తీరిపోతాయి. వ్యాపారవేత్తలకు ఆదాయం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏ పనినైనా మీరు సులువుగా చేయగలుగుతారు.
మీన రాశి
మీన రాశి వారికి గురువు నక్షత్ర స్థితిలో మార్పు వల్ల అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోయి సానుకూల ఆలోచనలు చేరుకుంటాయి. మీరు వ్యాపారంలో భారీ లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఎంతో మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీరు ఉత్తమమైన సమయాన్ని గడుపుతారు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన ఏ సమస్యలైనా కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.