- Home
- Astrology
- Jupiter Transit: కర్కాటక రాశిలోకి బృహస్పతి...ఐదు రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే..!
Jupiter Transit: కర్కాటక రాశిలోకి బృహస్పతి...ఐదు రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే..!
Jupiter Transit: గ్రహాల మార్పులు కొన్ని రాశుల జీవితాల్లో అద్భుతాలు చేస్తే, కొన్ని రాశుల వారికి సమస్యలు తెచ్చి పెడతాయి. అక్టోబర్ రెండో వారంలో కర్కాటకరాశిలోకి బృహస్పతి అడుగుపెడుతోంది. దీని వల్ల ఐదు రాశులకు సమస్యలు తప్పవు.

Zodiac signs
గ్రహాలు తరచూ మారుతూనే ఉన్నాయి. ఆ గ్రహాల మార్పులు కొన్ని రాశుల జీవితాల్లో అద్భుతాలు చేస్తే... మరి కొన్ని రాశుల వారికి మాత్రం సమస్యలు తెచ్చి పెడతాయి. అక్టోబర్ రెండో వారంలో కర్కాటక రాశిలోకి బృహస్పతి అడుగుపెడుతోంది. దీని వల్ల ఐదు రాశులకు సమస్యలు రానున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
మేష రాశి...
బృహస్పతి మేష రాశి నాలుగో ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి... ఈ రాశివారికి ఆ సమయంలో జాతకం తలకిందులు అవుతుంది. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతాయి. ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ... అనవసరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే... ఈ సమయంలో ఎవరికీ అనవసరపు వాగ్దానాలు చేయకపోవడే మంచిది. వాటిని మీరు నిలపెట్టుకోలేరు.
కర్కాటక రాశి.....
బృహస్పతి కర్కాటక రాశిలోకి అడుగుపెట్టడం ఈ రాశివారికి అంత మంచిదేమీ కాదు. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణాలు తీసుకోవడం, కొత్త వ్యాపారలు ప్రారంభించడం మానుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
తుల రాశి...
బృహస్పతి కర్కాటక రాశిలో అడుగుపెట్టడం.. తుల రాశి వారికి కూడా పెద్దగా కలిసి రాదు. ఈ రాశివారికి ఈ సమయంలో పనిభారం పెరుగుతుంది. అధికార స్థానాల్లో ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సన్నిహితులతో కూడా రహస్యాలను పంచుకోవద్దు.
ధనుస్సు
బృహస్పతి రాశి మార్పు... ఎనిమిదవ ఇంట్లో ఉండటం ఊహించని ఖర్చులు , ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అయితే, రుణాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం.
కుంభం
గురు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల పనిభారం పెరుగుతుంది. సన్నిహితులు కూడా శత్రువులలా ప్రవర్తిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. కారులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.