Jupiter Retrograde: గురు తిరోగమనం... మూడు నెలలు మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే..!
Jupiter Retrograde: నవంబర్ 11, 2025 వ తేదీన గురు గ్రహం కర్కాటక రాశిలో తిరోగమనం చేయనుంది. డిసెంబర్ 4వ తేదీన మిథున రాశిలోకి అడుగుపెట్టనుంది. గురు గ్రహం దాదాపు 120 రోజుల పాటు తిరోగమనంలో ఉంటుంది. ఈ ప్రభావం మూడు రాశులపై ఉంటుంది

గురు గ్రహ తిరోగమనం...
జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ఇలా గ్రహాలు మారుతున్న ప్రతిసారీ... అన్ని రాశులపై ఏదో ఒక ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. కొన్ని గ్రహాలు అప్పుడప్పుడు తిరోగమనం కూడా చేస్తూ ఉంటాయి. గురు గ్రహం నవంబర్ నెలలో కర్కాటక రాశిలో తిరోగమనం చేయనుంది.
నవంబర్ 11, 2025 వ తేదీన గురు గ్రహం కర్కాటక రాశిలో తిరోగమనం చేయనుంది. డిసెంబర్ 4వ తేదీన మిథున రాశిలోకి అడుగుపెట్టనుంది. కాబట్టి.. గురు గ్రహం దాదాపు 120 రోజుల పాటు తిరోగమనంలో ఉంటుంది కాబట్టి, కొన్ని రాశులపై ఈ తిరోగమనం ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా మూడు రాశులకు అదృష్టం కలగనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా....
1.కన్య రాశి...
గురు తిరోగమనం కన్య రాశివారికి చాలా మేలు చేయనుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం, గురు తిరోగమనం కన్య రాశి పదకొండవ ఇంట్లో జరగనుంది. ఈ సమయంలో కన్య రాశివారి ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. డబ్బు సంపాదించే అవకాశాలు బాగా పెరగడంతో.. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ మూడు నెలల్లో విపరీతంగా డబ్బు సంపాదించగలుగుతారు. ఎలాంటి పని చేసినా విజయం సాధించగలరు. ఆఫీసులో కూడా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
2.మకర రాశి...
గురు గ్రహ తిరోగమనం మకర రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గురు గ్రహ తిరోగమనంలో ఉన్నప్పుడు... దాని సంచారం ఈ రాశి ఏడవ ఇంట్లో ఉంటుంది. ఈ సమయంలో, మీ వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్లడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మూడు నెలలు ఈ రాశివారికి మహర్దశ నడుస్తుంది
3.మిథున రాశి...
గురు గ్రహ తిరోగమనం మిథున రాశివారికి చాలా మంచి ఫలితాలను తీసుకురానుంది. ఈ మూడు నెలల సమయంలో ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు. మీ మాటల ప్రభావం పెరుగుతుంది. ప్రజలు మీ మాటలకు ఆకర్షితులవుతారు, ఇది మీ ఆర్థిక స్థితిని పెంచుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త అవకాశాలను పొందుతారు. సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడంతో పాటు, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు అవుతాయి. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

