MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • గురు వక్ర గమనం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా లేకపోతే కష్టాలు తప్పవు!

గురు వక్ర గమనం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా లేకపోతే కష్టాలు తప్పవు!

జ్యోతిష్య ప్రకారం గ్రహాల మార్పులు వ్యక్తుల జీవితాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. నేడు(నవంబర్ 11న) గురువు కర్కాటక రాశిలో వక్రగమనాన్ని ప్రారంభిస్తాడు. ఇది 3 రాశులవారికి చెడు ఫలితాలు ఇవ్వనుంది. దాదాపు 4 నెలలు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

2 Min read
Author : Kavitha G
Published : Nov 11 2025, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గురు వక్రగమనం
Image Credit : Getty

గురు వక్రగమనం

జ్యోతిష్య శాస్త్రంలో గురువును శుభ గ్రహంగా పరిగణిస్తారు. జ్ఞానం, ఆధ్యాత్మికత, సంపద వంటి వాటికి కారకుడు గురువు. గురు కదలికలు వ్యక్తుల జీవితాలపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తాయి. ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో వక్రించి.. మిథున రాశిలోకి ప్రయాణిస్తాడు. ఇది 11 మార్చి 2026 వరకు కొనసాగుతుంది. గురు వక్రగమనం 3 రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. మరి ఆ రాశులేంటో వారికి కలిగే ఇబ్బందులేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి
Image Credit : our own

మేష రాశి

గురు వక్రగమనం వల్ల మేషరాశి వారికి గంధరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. గురు ప్రస్తుతం ఈ రాశి 4వ ఇంట్లో వక్రంగా సంచరించటం వల్ల ఇంటి సంబంధిత సమస్యలు, కుటుంబంలో అశాంతి, గృహ మార్పులు లేదా ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తవచ్చు. భావోద్వేగపరంగా కొంత అస్థిరంగా అనిపించవచ్చు, ముఖ్యంగా పెద్దలతో లేదా తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ కాలంలో కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. 

మేషరాశి వారికి ఈ వక్రగమనం ఆత్మపరిశీలనకు ఒక అవకాశంలా మారుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలలో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగాల్లో పనిలో ఒత్తిడి ఉన్నా.. గురు వక్రగమనం.. ఈ రాశివారిని ధర్మ మార్గం వైపు నడిపిస్తుంది. ధ్యానం, శాంతి, తల్లిదండ్రుల సేవ.. గురు వక్రగమన కాలాన్ని కొంత సానుకూలంగా మార్చవచ్చు. 

34
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథునరాశి వారిపై గురు వక్రగమనం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే గురువు కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి వక్రగమనంలో ప్రవేశిస్తాడు. దీని ప్రభావం మిథున రాశివారి డబ్బు, మాట, కుటుంబం, ఆత్మావిశ్వాసంపై బలంగా పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మాటలపై నియంత్రణ అవసరం. కొన్ని మాటల వల్ల చిన్న చిన్న గొడవలు, సంబంధాల్లో చీలికలు రావచ్చు. ఆర్థికంగా కూడా జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చుల వల్ల అప్పుల భారం పెరగవచ్చు. 

వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తాత్కాలిక లాభం కోసం తొందరపడకూడదు. విద్యార్థులకు మాత్రం ఈ కాలం.. గతంలో చేసిన తప్పుల గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది. గురు వక్రగమనంలో ఓపిక, ధైర్యం అవసరం. వృత్తిలో కొత్త అవకాశాలు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ.. మార్చి 2026 తర్వాత మళ్లీ పురోగతి కనిపిస్తుంది.

44
కర్కాటక రాశి
Image Credit : AI

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారిపై గురు వక్రగమన ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. గురు కర్కాటక రాశిలోనే వెనక్కి కదలడం ప్రారంభించడం వల్ల ఆధ్యాత్మిక, వ్యక్తిగత, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొంత గంధరగోళంగా, ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ కలిగినా.. ఈ కాలం ఆత్మవిశ్లేషణకు అత్యుత్తమ సమయం. ఏ దిశలో వెళ్లాలో, ఎవరిని నమ్మాలో ఆలోచించాల్సిన సమయం. 

వ్యక్తిగత సంబంధాలు.. ముఖ్యంగా జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రావచ్చు. అపార్థాలు దూరం చేయడానికి సహనం చాలా అవసరం. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు, నీరసం, మానసిక ఒత్తిడి వంటివి కనిపిస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
ఈ 4 రాశుల అబ్బాయిలు చాలా స్పెషల్.. అమ్మాయిలకు వీరు ఇట్టే నచ్చేస్తారు!
Recommended image2
బుధుడి వక్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి 20 రోజుల వరకు చుక్కలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved