ఇంట్లో బల్లి పిల్లలు ఉండటం శుభమా? అశుభమా?
ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది బల్లులను ఇంట్లో నుంచి తరిమేస్తుంటారు. అయితే ఇంట్లో బల్లి పిల్లలు కనిపిస్తే ఏం అర్థం వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.
బల్లులు ఉంటే బల్లి పిల్లలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి రాత్రి, ఉదయం అంటూ అప్పుడప్పుడు గోడలపై తిరుగుతూనే ఉండటం మీరు చూసే ఉంటారు. అసలు ఇంట్లో బల్లి పిల్లలు ఉండటం శుభమా? అశుభమా? తెలుసుకుందాం పదండి.
ఇంట్లో బల్లి ఉండటం..
చాలా మంది ఇండ్లలో ఖచ్చితంగా బల్లులు ఉంటాయి. ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు బల్లులను గోడలపై చూస్తుంటారు. ఇంట్లోకి ఒక్క బల్లి వచ్చినా.. కొన్ని రోజుల తర్వాత చాలా బల్లులు అవుతాయి. ఇవి గుడ్లు పెట్టి పిల్లలను కంటుంటాయి. కానీ ఇంట్లో బల్లులు ఉండటం చాలా మందికి ఇష్టం ఉండదు.
ఇంట్లో బల్లి ఉంటే?
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇంట్లో బల్లి ఉండటం శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో బల్లి ఉంటే మీకు డబ్బుకు సంబంధించిన కష్టాలేమీ లేవని అర్థం. ఇంట్లోని బల్లి.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావిస్తారు.
ఇంట్లో సంతోషం, శ్రేయస్సు
చాలా మంది బల్లులను ఇంట్లో ఉంచడానికి అస్సలు ఇష్టపడరు. కానీ బల్లి మీ ఇంట్లో ఉంటే.. మీ ఇల్లు సుఖసంతోషాలు, ఆనందం, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. దీనివల్ల మీ కుటుంబంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.
నిలిచిపోయిన పనులు పూర్తి
మీ ఇంట్లో బల్లి పిల్లలను చూడటం కూడా మంచిదే. నిజానికి దీన్ని శుభపరిణామంగా భావిస్తారు. ఎందుకంటే మీ ఇంట్లో బల్లి పిల్లలు కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు మీరు కొన్ని శుభవార్తలను కూడా వింటారు.
Lizard at home
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు
మీ ఇంట్లో బల్లి పిల్లలను కంటే మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడబోతున్నారని అర్థం వస్తుంది. అంతేకాదు మీకు డబ్బులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. బల్లి లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.
ఇబ్బందుల నుంచి బయటపడటం
మీ ఇంట్లో బల్లి ఉండటం, అది పిల్లల్ని కనడం అంటే.. మీ బిడ్డకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయనడానికి ఇది సంకేతం అంటున్నారు జ్యోతిష్యులు.
బల్లి పిల్ల చనిపోతే ఏం చేయాలి?
ఇంట్లో బల్లి పిల్లలను చంపడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఒకవేళ చనిపోయిన బల్లి పిల్ల ఉన్నా, బల్లి ఉన్నా దానిని భూమిలో ఖచ్చితంగా పాతిపెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.