MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Bird Nest: మీ ఇంట్లో పక్షి గూడు కట్టిందా? శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Bird Nest: మీ ఇంట్లో పక్షి గూడు కట్టిందా? శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Bird Nest: మీ ఇంట్లో పక్షులు ఎప్పుడైనా గూడు కట్టాయా? అసలు ఇలా పక్షులు ఇంటి ఆవరణలో గూడు కట్టుకోవడం శుభమా? అశుభమా?  ఇంట్లోనే ఉంచేయాలా? లేక తొలగించాలా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 24 2026, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పక్షి గూడు కడితే ఏమౌతుంది?
Image Credit : chat GPT

పక్షి గూడు కడితే ఏమౌతుంది?

పక్షులు ఇంట్లోకి దూరి లేదంటే.. బాల్కనీల్లో గూడు కట్టుకోవడం చాలా సర్వ సాధారణం. కొందరు వాటిని చూసి జాలిపడి కదిలించకుండా ఉండనిస్తారు. మరి కొందరు, గూడు కట్టుకున్నా సరే వాటిని వెళ్లగొట్టే వరకు నిద్రపోరు. అసలు.. ఈ పక్షి గూడుపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..

మన ఇంట్లో ఏ పక్షి గూడు కడుతుందో.. దాని ఆధారంగా మన ఇంటికి శుభం జరుగుతుందో, అశుభం జరుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.పావురాలు...
Image Credit : Freepik

1.పావురాలు...

పావురాలు చాలా ఎక్కువగా ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి.నిజానికి, పావురాలను శాంతి, సామరస్యాలకు చిహ్నంగా భావిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం, ఒక పావురం మీ ఇంట్లో లేదంటే.. వరండా, బాల్కనీల్లో గూడు కడితే.. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను, బంధాన్ని బలపరుస్తుంది.

అంతేకాదు, ఈ పక్షి ఇంట్లో గూడు కడితే.. ఆర్థికంగానూ బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా లభాలు వస్తాయని నమ్ముతారు. అయితే.. ఎక్కువ సంఖ్యలో పావురాలు వచ్చి ఇంట్లోకి లేదంటే బాల్కనీలో కి దూరితే.. ఎక్కువగా పాడు చేస్తాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఎక్కువ మంది పావురాలను ఇంట్లోకి రానివ్వరు.

Related Articles

Related image1
Insects: వర్షాకాలంలో ఈ పురుగులు పాముల కంటే ఎక్కువ డేంజర్..!
Related image2
Ear Chain: బంగారం కాదు, పూసలతో ఇయర్ చైన్స్.. ఇప్పుడు ఇవే ట్రెండ్
33
2.ఇంట్లోకి పిచుక దూరితే...
Image Credit : Freepik

2.ఇంట్లోకి పిచుక దూరితే...

ప్రస్తుత కాలంలో పిచుకలు ఎక్కువగా ఇంట్లో కనిపించడం లేదు అనే చెప్పాలి. కానీ, పిచుక కనుక మీ ఇంట్లో, కిటికీల దగ్గర, బాల్కనీలో కనుక గూడు కడితే.. దీనిని చాలా శుభసూచకంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం, పిచ్చుక రాక ఇంటి శాంతిని,సంపదను తెస్తుంది. ముఖ్యంగా పిచ్చుక ఇంటి తూర్పు దిశలో గూడు కడితే.. అది ఆ ఇంటి కుటుంబ విజయానికి మార్గం సులభం చేసిందని అర్థం. పక్షులు సాధారణంగా భద్రత, తాము సురక్షితంగా ఉంటాము అని భావించిన ప్రదేశంలో మాత్రమే గూడును కడతాయి. అందుకే, పిచ్చుక మీ ఇంట్లో గూడు కట్టుకుంది అంటే.. మీ ఇల్లు ప్రేమతో నిండి ఉందని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని అర్థం. వాస్తు ప్రకారం కూడా పిచ్చుక ఇంట్లోకి అడుగుపెట్టినా శుభం జరుగుతుంది.

మైనా పక్షి గూడు కడితే..

వాస్తు శాస్త్రం ప్రకారం, మైనా పక్షి ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో గూడు కడితే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ పక్షి రాకతో కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయని, బంధాలు బలపడతాయని నమ్ముతారు. త్వరలోనే వారు ఇంట్లో శుభవార్త వినే అవకాశం కూడా ఉందని నమ్మకం.

పక్షి గూడు కట్టినప్పుడు ఏం చేయాలి?

పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకొని పిల్లలు పెట్టినప్పుడు దానిని కదిలించకపోవడమే మంచిది. కదిలిస్తే.. ఆ చిన్న ప్రాణాలు మరో గూడు కట్టే వరకు నివాసం లేక ఇబ్బంది పడతాయి. మీకు ఇష్టం లేకపోతే.. పక్షులు రెక్కలు వచ్చి ఎగిరిపోయే వరకు ఆగి.. ఆ తర్వాత మీరు గూడు తీసేయచ్చు. కానీ, పక్షులు ఉన్నప్పుడు మాత్రం గూడు కదిలించకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image2
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image3
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Related Stories
Recommended image1
Insects: వర్షాకాలంలో ఈ పురుగులు పాముల కంటే ఎక్కువ డేంజర్..!
Recommended image2
Ear Chain: బంగారం కాదు, పూసలతో ఇయర్ చైన్స్.. ఇప్పుడు ఇవే ట్రెండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved