Saturn Retrograde: శని తిరోగమనం.. 2026లో ఈ ఐదు రాశుల ఆదాయం రెట్టింపు అవుతుంది..!
Saturn retrograde: 2026లో శని గ్రహం తిరోగమనంలోకి వెళ్తుంది. ఇది కొన్ని రాశుల అదృష్టం రెట్టింపు అవుతుంది. శని దేవుని అనుగ్రహం ఐదు రాశులపై చాలా ఎక్కువగా ఉంటుంది.

saturn
తొమ్మది గ్రహాలలో శని అత్యంత అశుభ గ్రహంగా పరిగణిస్తారు. ఇది అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదులుతుంది. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం శని మీన రాశిలో కదులుతున్నాడు. జులై 2026లో శని తిరోగమనంలోకి వెళ్తుంది. జాతకంలో శని బలంగా ఉంటే, అటువంటి రాశి చక్రం అదృష్టం బాగుంటుంది. ఆనందం, సంపద పెరుగుతుంది. మరి, ఏ రాశులకు శని అదృష్టాన్ని ఇవ్వనున్నాడో ఇప్పుడు చూద్దాం....
మేష రాశి...
2026 మేష రాశివారి జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా, శని ఆశీస్సులు లభిస్తాయి. శని మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు, మీరు పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభం పొందుతారు. కెరీర్ లో అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇళ్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు వంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ జాతకంలో ప్రతిదీ శుభప్రదంగా మారుతుంది. పిల్లల విద్య, ఉద్యోగం, వివాహం వంటి విషయాల్లో శుభవార్తలు వింటారు.
సింహ రాశి...
2026 సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో మీరు కోరుకున్న మార్పులన్నీ జీవితంలో కలుగుతాయి. ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది. ఉద్యోగుల జీతాలు పెరిగే సమయం ఇది. అంతేకాకుండా, నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. కొత్త ప్రణాళికలను రూపొందించడం, వాటిలో ఆర్థిక పెట్టుబడులు పెట్టడం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. సంపద, అదృష్టం, కీర్తి, విజయం అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
వృశ్చిక రాశి....
వృశ్చిక రాశి వారికి 2026 లో అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించగలరు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో కూడా బాగా రాణించగలరు. శని దేవుడి ఆశీస్సులన్నీ మీకు లభిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆదాయం పెంచుకుంటారు.
ధనుస్సు రాశి...
2026 ధనుస్సు రాశివారికి చాలా మంచి మార్పులను తీసుకురానుంది. శని అనుగ్రహంతో సంపద, సుఖం, ఆనందం మీ సొంతమౌతాయి. మీరు మీ పెండింగ్ లో ఉన్న అనేక పనులను పూర్తి చేయగలుగుతారు. దీని కారణంగా, మీరు రెట్టింపు డబ్బు సంపాదిస్తారు. అనేక ఆర్థిక మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు చూసి మీరే షాక్ అవుతారు. వైవాహిక సమస్యలు తగ్గిపోతాయి. ఏ రంగాన్ని ఎంచుకున్నా ఉన్నత స్థాయికి వెళ్లగలరు.
మకర రాశి...
2026 మకర రాశి వారికి అనేక ప్రయోజనాలను తీసుకురానుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ఊహించని మార్పులు రెట్టింపు లాభాలు తెస్తాయి. శని అనుగ్రహం వల్ల ఆర్థిక భద్రత ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని నుంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగుల అదృష్టం కూడా పెరుగుతుంది. కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.