అన్ని రాశుల వారు ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా..?
ఒక్కో రాశి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయితే.. మరి ఈ 12 రాశులకు చెందిన వ్యక్తులను ఒకే ఇంట్లో ఉంచితే ఎలా ఉంటుంది..? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో..? వారు ఎలా ఫీలౌతారో ఓసారి చూద్దాం..

Daily Horoscope 2022 - 21
జోతిష్యశాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులకు పొంతన ఉండదు. ఒక్కో రాశి ఒక్కోలా ఉంటుంది. ఒక్కో రాశి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయితే.. మరి ఈ 12 రాశులకు చెందిన వ్యక్తులను ఒకే ఇంట్లో ఉంచితే ఎలా ఉంటుంది..? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో..? వారు ఎలా ఫీలౌతారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
ఏదైనా విషయాన్ని అందరికీ చెప్పి... అందరినీ ఒప్పించగల సామర్థ్యం.. మేష రాశివారిలో ఉంటుంది. ఏ విషయంలో ఎవరినైనా కన్విన్స్ చేయగలరు వీరు. అంతటి సామర్థ్యం వీరికి ఉంటుంది. ఈ విషయంలో వీరు బెస్ట్ అని చెప్పొచ్చు.
2.వృషభ రాశి..
చుట్టూ ఎంత మంది ఉన్నా వీరికి ఏదీ పట్టదు. ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తారు. లేదంటే.. ట్యాబ్ చూస్తారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి వెబ్ సిరీస్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మధ్యలో పాప్ కార్న్ మాత్రం తప్పనిసరి.
3.మిథున రాశి..
మిథున రాశివారు ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటారు. వీరికి మాట్లాడేవాళ్లు దొరికితే చాలు చాటర్ బాక్స్ లాగా మాట్లాడుతూనే ఉంటారు. ఎదుటివారు వింటున్నారో లేదో కూడా పట్టించుకోరు.. చెబుతూనే ఉంటారు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు అందరితో కలిసి పని చేస్తుంటారు. ఎవరైనా ఏదైనా అడిగితే.. వారి కోసం పని చేస్తాడు. ఎవరు ఏది అడిగినా కాదు అనే సమాధానం వీరి దగ్గర ఉండదు.
5.సింహ రాశి..
ఈ రాశివారికి తమ మీద ప్రేమ ఎక్కువ. తాము అందంగా ఉంటామని ఫీలౌతూ ఉంటారు. అందుకే.. ఇంట్లోని అన్ని చోట్లా నిల్చొని సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఆ తర్వాత అద్దం ముందు కూర్చొని తమను తాము చూసుకొని మరిసిపోతూ ఉంటారు.
6.కన్య రాశి..
ఈ రాశివారికి కాస్త పని మీద శ్రద్ధ ఎక్కువ. అందుకే ఇతరులతో కలిసి ఇల్లు సర్దడం, లాండ్రీ పనులు చేయడం లాంటివి చేస్తారు. ఇల్లును బాగా శుభ్రం చేసి.. నీట్ గా సర్దుతారు.
7.తుల రాశి..
ఈ రాశివారు.. అందరితో కలిసి కూర్చొని.. అన్ని రాశులవారితో సరదాగా మాట్లాడతారు. వీరికి అందరితో కలిసి మాట్లాడటం అంటే చాలా ఇష్టం.
8.వృశ్చిక రాశి...
ఈ రాశివారు మంచి డ్రెస్సింగ్ చేసుకుంటారు. వివిధ రకాల గెటప్స్ వేసుకొని.. తాము ఏ డ్రెస్ లో బాగున్నామో చెక్ చేసుకుంటూ ఉంటారు. డిఫరెంట్ లుక్స్ వీరు ప్రయత్నిస్తారు.
9. ధనస్సు రాశి..
ఈ రాశివారికి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. తమతో ఉన్నవారు వచ్చినా, రాకున్నా .. వారు మాత్రం శుక్రవారం రాగానే.. బ్యాగ్ సర్దుకొని ఏదో ఒక ప్రదేశానికి వెళ్లిపోతారు. వీకెండ్ మొత్తం తిరిగి.. వీక్ డే సమయానికి మళ్లీ ఇంటిని చేరుకుంటారు.
10.మకర రాశి..
ఈ రాశివారు తమ చుట్టూ ఉన్నవారితో చిల్ అవుతూనే తమ వర్క్ చేసుకుంటారు. ల్యాప్ టాప్, రెండు, మూడు ఫోన్ లతో బిజీగా ఉంటూ.. వర్క్ చేసుకుంటూనే అందరితోనూ ఎంజాయ్ చేస్తారు.
11.కుంభ రాశి..
ఈ రాశివారు టీవీలో తమకు నచ్చిన పాటలు, ప్రోగ్రాములు వస్తున్నా సరే.. వాటిని చూడాలనే మనసు చంపుకొని.. కొంచెం దూరం జరిగి.. వర్క్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వర్క్ చేయకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వీరికి బాగా తెలుసు.
12.మీన రాశి..
ఈ రాశివారు ఎక్కువగా కలలు కంటూ ఉంటారు. పగలు కూడా ఏదో ఒక కలలు కంటూ ఉంటారు. తమ జాతకం ఎలా ఉందా అని ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు.