బుధ గ్రహంలో మార్పులు.. మీ డేటింగ్ లైఫ్ ఎలా మారనుంది..?
ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని కొన్ని అంశాలలో కొన్ని లేదా ఇతర రకాల ఆందోళన లేదా ఇబ్బందులను అనుభవిస్తారు.

Daily Horoscope 2022 - 22
మూడు వారాలుగా బుధ గ్రహంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. బుధ గ్రహం తిరోగమనం చెందుతూ వస్తోంది. ఈ క్రమంలో ప్రజల జీవితాల్లో కొన్ని మార్పులు జరుుగుతున్నాయి. చాలా మంది ప్రజలు ఒత్తిడికి గురౌతున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని కొన్ని అంశాలలో కొన్ని లేదా ఇతర రకాల ఆందోళన లేదా ఇబ్బందులను అనుభవిస్తారు. ఆ ఇబ్బంది వారికి సంబంధాలను నిలుపుకోవడం లో కావచ్చు.. లేదంటే.. తమ కెరిర్ ని కాపాడుకోవడంలో కావచ్చు. కాగా.. ఈ బుధ గ్రహం తిరోగమనం కారణంగా.. ఏ రాశివారి డేటింగ్ లైఫ్ ఎలా మారనుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1.మేష రాశి..
మేష రాశి వారు చాలా దృఢంగా ఉంటారు. అన్ని విషయాలు వీరికి నచ్చవు. వీరు ప్రతిదీ అందంగా... ఇంద్ర దనస్సులా ఉండాలని అనుకుంటూ ఉంటారు. తమపై తాము నమ్మకంగా ఉంటే వీరు అన్నింట్లో విజయం సాధిస్తారు. వీరు డేటింగ్ కోసం మ్యాచ్ వెతుక్కునే పని మొదలుపెట్టొచ్చు. మేష రాశివారికి కర్కాటక రాశి పర్ఫెక్ట్ మ్యాచ్. వీరితో ప్రేమ, డేటింగ్ ఏదైనా కరెక్ట్ గా సెట్ అవుతాయి. వీరి సాన్నిహిత్యం బాగుంటుంది.
2.వృషభ రాశి...
వృషభ రాశివారు చాలా మొండిగా ఉంటారు. చాలా పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధించి తీరతారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో. ఇక డేటింగ్ విషయానికి వస్తే... వృషభ రాశి వారికి వారు ఏం కోరుకుంటున్నారో వారికి ఖచ్చితంగా తెలుసు. ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉంటారు. ఈ బుధ గ్రహం తిరోగమనంలో... డేటింగ్ చేయడానికి వీరికి సరైన సమయం. ఈ రాశివారికి తుల రాశి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. వీరితో డేటింగ్ బాగుంటుంది.
3.మిథున రాశి..
మిథున రాశివారు బహిర్ముఖులు. చాలా ఆవేశం ఎక్కువ. ఈ బుధ గ్రహ తిరోగమన సమయంలో.. వీరు ప్రేమ విషయంలో కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంది. మిథున రాశివారికి తుల రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్. ఆ రాశివారితో డేటింగ్ చేయడం బెటర్.
4.కర్కాటక రాశి..
ఈ కర్కాటక రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. అందరితోనూ చాలా దయగా ఉంటారు. అందరితోనూ చాలా ప్రేమగా ఉంటారు. ఎవరికైనా ఇట్టే నచ్చేస్తారు. అయితే.. ఈ బుద గ్రహ తిరోగమనం.. మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మీ మెరుపు తగ్గిస్తుంది. డేటింగ్ సమయంలో ఎంచుకునే వ్యక్తి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తిని ఎంచుకోవాలి. ఈ రాశివారికి మీన రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్.
5.సింహ రాశి..
ఈ రాశివారు పేరుకే అందరినీ భయపెడతారు. కానీ.. ఈ రాశివారు నిజానికి చాలా విశ్వాసంగా ఉంటారు. చాలా విశ్వాసపాత్రంగా కూడా ఉంటారు. వీరు అందరిలోనూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉంటారు. ఈ రాశివారికి మేష రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ గా చెప్పొచ్చు.
6.కన్య రాశి..
కన్య రాశివారు సాధారణంగా ఆచరణాత్మకంగా ఉంటారు. శీఘ్ర ఆలోచనా పరులుగా ఉంటారు. వీరు అందరికీ సలహాలు అందిస్తూ ఉంటారు.చాలా మంది వ్యక్తుల మాదిరిగానే, మీరు హృదయానికి సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మీ స్వంత సలహా తీసుకోవడాన్ని సౌకర్యవంతంగా మర్చిపోతారు. డేటింగ్ విషయంలో మీరు చాలా కాలం ఒంటరిగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశివారికి కర్కాటక రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్.
7.తుల రాశి..
తులారాశిగా, మీరు స్నేహపూర్వకంగా, భావోద్వేగంగా రొమాంటిక్ గా ఉంటారు. అయితే.. బుధ గ్రహ తిరోగమనంలో.. మీరు మీ హృదయాన్ని కాపాడుకోవడం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సక్సెస్ అయ్యింది కదా.. అని పెళ్లి , పిల్లల విషయానికి తొందరగా వెళ్లకపోవడమే మంచిది. ఈ రాశివారికి.. సింహ రాశి, కుంభ రాశివారు చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అనే చెప్పొచ్చు.
8.వృశ్చిక రాశి..
వృశ్చికరాశి వారు తమ శక్తి , ప్రకంపనలకు సరిపోయే మనస్సు కోసం ఎదురు చూస్తున్నారు. వీరు చాలా ధృఢమైన వ్యక్తులు. బుధ గ్రహ తిరోగమనంలో వీరికి ఎమోషన్స్ ఎక్కువగా అవుతాయి. బుర్రతో కాకుండా మనసుతో ఆలోచిస్తారు. కాబట్టి హృదయపూర్వక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. విడిపోయిన తర్వాత మళ్లీ మాజీ లను కలవాలని ఆరాటపడుతూ ఉంటారు.ఆ పొరపాటు చేయకుండా ఉండటం మంచిది. ఈ రాశివారికి కన్య రాశి వారు చాలా పర్ఫెక్ట్ మ్యాచ్.
9.ధనస్సు రాశి..
ధనుస్సు రాశివారు స్వతంత్ర ఆలోచనాపరులు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. బుధ గ్రహ తిరోగమనం వీరికి అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా ప్రేమ, డేటింగ్ విషయంలో వీరు సక్సెస్ అవుతారు. ఈ రాశివారికి మేష, సింహ, ధనస్సు రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.
10.మకర రాశి..
మకరరాశివారు ప్రతిష్టాత్మకంగా, లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవస్థీకృత పద్ధతిలో పనిచేయడానికి ఇష్టపడతారు. వారు వారి భాగస్వామి వీరికి అన్ని విధాలుగా సహాయంగా ఉంటారు. అయితే, ఈ బుధ గ్రహ తిరోగమన సమయంలో, ముఖ్యంగా డేటింగ్ విషయంలో కొన్ని తప్పులు, జాప్యాలు ఉండవచ్చు. తేదీలో విషయాలు మీ మార్గంలో జరగకపోతే లేదా మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నా కూడా ఆశను కోల్పోకండి. మీ పరిపూర్ణ భాగస్వామిని వ్యక్తీకరించడానికి, మీ ఉద్దేశాలను విశ్వానికి పంపడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. మీ లక్ష్యాల గురించి మీరు ఎంత స్పష్టంగా ఉంటే, అది మీకు త్వరగా వస్తుంది. మకర రాశివారికి వృషభ రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు చాలా ప్రశాంతంగా, సున్నితంగా ఉంటారు. వారు ఏం కోరుకుంటున్నాము అనే విషయంలో వీరికి చాలా క్లారిటీ ఉంటుంది. అయితే.. బుధ గ్రహ తిరోగమనం కారణంగా.. మిమ్మల్ని నమ్మే వ్యక్తుల నుంచే మీరు అపార్థాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. మీ మాజీలుు మళ్లీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండి.. వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది. కుంభ రాశివారికి మిథున రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు.
12.మీన రాశి..
మీన రాశివారు మానసికంగా సున్నితంగా ఉంటారు. తేలికగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులకైనా అనుగుణంగా ఉంటారు. ఈ బుధ గ్రహ తిరోగమన సమయంలో.. మీరు ఎమెషన్ గా సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. ఆ సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలి. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.. మీలో ఉన్న భయాలను పొగొట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు వెతుకుతున్న వ్యక్తి మీకు దగ్గరలోనే ఉండే అవకాశం ఉంది. మీన రాశివారికి కుంభ రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్. వీరిద్దరూ ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు.