అబద్దాలు ఆడుతూ పట్టుబడితే... మీపిల్లలు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా..
పిల్లలు అబద్ధాలు ఆడడం మామూలే. అయితే, అబద్దాలు ఆడి పట్టుబడితే.. ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తారు. అయితే అబద్దాలు ఆడడం, పట్టుబడడం.. వారి రాశి చక్రం ప్రకారమే ఉంటుందట.

మేషరాశి (Aries) : మామూలుగా మేషరాశికి చెందిన పిల్లలు అబద్దాలు ఆడరు. ఆబద్ధం ఆడాలా? వద్దా? అనే మీమాంస వస్తే ఒకవిధమైన డైలమాలో ఉంటారు. ఒకవేళ ఏదైనా కారణంతో అబద్ధాలు ఆడితే.. పట్టబడితే వెంటనే ఒప్పేసుకుంటారు. అంతేకాదు.. అబద్దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని పంచుకుంటారు.
వృషభరాశి ( Taurus) : ఇబ్బందికరపరిస్థితుల్లో ఇరుక్కోవడం వీరికి ఇష్టం ఉండదు. అందుకే ఒకవేళ అబద్దాలు ఆడి పట్టుబడితే.. దాన్నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ కంఫర్ట్ జోన్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తారు.
మిధునరాశి ( Gemini) : మిధునరాశి పిల్లలు అబద్దాలు ఆడినా అస్సలు దొరకరు. ఒకవేళ తప్పిదారి పట్టుబడితే ఏదో ఒక కహానీ చెప్పి తప్పించుకుంటారు.
కర్కాటకరాశి ( Cancer) : వీరు కాస్త పద్దతిగా ఉంటారు. అబద్దాలు ఆడి పట్టుబడితే ఎమోషనల్ అయిపోతారు. పశ్చాత్తాపం కనబరుస్తారు. గిల్టీగా ఫీలవుతారు.
సింహరాశి (Leo) : తాము ఆడిన అబద్దాలు పట్టుబడినా కూడా సింహరాశికి చెందిన పిల్లలు అంత ఈజీగా ఒప్పుకోరు. అంతేకాదు దీంతో ఏదైనా గొడవ జరిగితే ఎంజాయ్ చేస్తారు. కారణం వీరిది అటేన్షన్ సీకింగ్ మనస్తత్వం కాబట్టి..
కన్యారాశి ( Virgo) : వీళ్లు చాలా పరిఫక్షనిస్టులు. అబద్దాలు ఆడినా అదే మెయింటేన్ చేస్తారు. ఒకవేళ పట్టుబడితే ఎందుకు అబద్దాలు ఆడాల్సి వచ్చిందో.. నిజానికి ఏం జరిగిందో నిజాయితీగా ఒప్పుకుంటారు.
Representative Image: Libra
తులారాశి ( Libra) : వీరికి ఎదుర్కోవడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరితోనైనా అబద్ధం చెప్పి.. అది తెలిసిపోయినా సరే.. ఆ వ్యక్తికి కనిపించకుండా తిరుగుతారు. ఒకవేళ ఎదురుపడినా పట్టించుకోరు. కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వరు.
వృశ్చికరాశి ( Scorpio) : వీరు అబద్దాలాడి పట్టుబడినా క్షమాపణలు చెప్పరు. ఎందుకంటే వీరు తమను తాము రక్షించుకోవడానికో.. తము బాగా ఇష్టపడేవారిని కాపాడడానికో మాత్రమే అబద్ధాలు ఆడతారు.
ధనుస్సురాశి ( Sagittarius) : ధనుస్సు రాశివారు మామూలుగా అబద్ధాలు ఆడరు. ఒకవేళ అబద్ధాలు ఆడితే, పట్టుబడితే.. వెంటనే ఒప్పేసుకుంటారు. క్షమాపణలు చెబుతారు. విషయాల్ని సాగదీయడం వీరికి ఇష్టం ఉండదు.
మకరరాశి ( Capricorn) : ఈ రాశివాళ్లు అబద్దం ఆడుతున్నారని ఈజీగా తెలిసిపోతుంది. అబద్ధాలు ఆడడంతో అంత బ్యాడ్ గా ఉంటారు వీళ్లు.
కుంభరాశి (Aquarius) : కథలు చెప్పడంతో సిద్దహస్తులు. తాము అబద్ధం చెప్పిన విషయం తెలిసిపోతే వెంటనే.. ఒప్పుకోరు. దాన్ని కప్పిపుచ్చడానికి మరో అబద్ధం ఈజీగా ఆడేస్తారు.
మీనరాశి ( Pisces) : అబద్దాలు ఆడితే ఈజీగా పట్టుబడతారు. ఎందుకంటే వారికి ఇష్టం ఉండదు. అయితే, ఏదేమైనా కానీ అబద్దాలు ఆడినా, నిజం చెప్పినా తమ మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు.