ఈ రాశివారిని హ్యాండిల్ చేయాలంటే.. కాస్త తెలివి కావాలి..
పంచభూతాల్లో ప్రతీరాశీ చక్రం ఏదో ఒకదానికి అధిపతి అయి ఉంటుంది. దాన్ని బట్టి వారిని ఎలా హ్యాండిల్ చేయాలో కొన్ని టాక్టిక్స్ ఉంటాయి. అవేంటో చూడండి..

మనందరిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. ప్రతీ మనిషికి తనదైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇది ఆయా రాశిచక్రాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఎదుటివ్యక్తిని నమ్మే విషయంలో.. వారితో వ్యవహరించే విషయంలో మంచీ, చెడు అనేక రకాలు ఉంటాయి. అయితే మనిషి గాలీ, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనే పాంచభౌతిక మూలకాలతో తయారైనట్టే.. ప్రతీ వ్యక్తి రాశిని ఒక్కో మూలకం అధిపతిగా ఉంటుంది. ఇందులో గాలి రాశులు కొన్ని.. అలా గాలి మూలకంతో రాశిచక్రం ఉన్నవారు తరచుగా తమ స్వంత వ్యక్తిగత ఆలోచనలు, అంచనాలకు హాని కలిగిస్తాయని గుర్తుంచుకోండి. వీరు భౌతిక అభ్యాసం కంటే సిద్ధాంతాన్ని ఇష్టపడతారు. వీరు ఏదైనా కాంక్రీట్ చేయడం కంటే ఎక్కువగా మాట్లాడతారు.
మిథునం
మిథునరాశి వారు సాధారణంగా ద్వంద్వ మనస్కులు. ఇతరుల మనసులతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా వాగ్దానం చేసి.. మరు క్షణం దానిని కాదని చెబుతుంటారు. వీరిని ఈజీగా మానిప్యులేట్ చేయచ్చు. వీరు ఎలాంటి మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించినా క్షణంలో అది కనిపెట్టి కట్టిపడేయచ్చు. మిథునరాశి వారు సాధారణంగా పోరాడడంలో కాస్త బలహీనులు.
కరణ్ జోహార్, సోనమ్ కపూర్, ఏక్తా కపూర్, శిల్పా శెట్టి, బాబ్ డైలాన్, మార్లిన్ మన్రో, కాన్యే వెస్ట్, ఏంజెలీనా జోలీ వంటి ప్రముఖులు మిథునరాశివారే.
Libra
తులారాశి
లిబ్రాన్స్ సాధారణంగా స్వీయ-కేంద్రీకృతమై ఉంటారు. వీరు లాజిక్ గా ఉండేవారిని.. లేదా లాజిక్ గా ఉండేవారినే నమ్ముతారు. ఎవరైనా లాజిక్ కు సంబంధించిన విషయాన్ని ప్రయత్నించడంలో విఫలమైనా వారెందుకు విఫలమయ్యారో వినడానికి ఇష్టపడతారు. తులారాశివారిని హ్యాండిల్ చేయాలంటే ఎదుటివారు కాస్త దృఢంగా ఉండాలి. గొంతులో కమాండింగ్ ఉండాలి. అప్పుడే ఎదుటివారి వాదనను అంగీకరిస్తారు. తులారాశివారిని లొంగదీయాంటే మీరు వారికంటే కాస్త ఎక్కువ అయి ఉండాలి.
అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సోహా అలీ ఖాన్, కిమ్ కర్దాషియాన్, గ్వెనిత్ పాల్ట్రో, లిల్ వేన్, స్నూప్ డాగ్ వంటి ప్రముఖులు ఈ రాశి కిందికి వస్తారు.
కుంభం
కుంభ రాశి వారికి అవకాశం ఇస్తేనే తెలివిగా ఉంటారు. వీరు తరచుగా విషయాలను దాచడానికి ప్రయత్నిస్తారు, కానీ వీరిని అడ్డంగా ప్రశ్నించినట్లయితే భయాందోళనలకు గురవుతారు. భయంతో మాత్రమే నిజం చెప్పవచ్చు. వీరిని హ్యాండిల్ చేయాలంటే వీరిని ప్రశ్నించడమో.. తెలివిగా వ్యవహరించడమో ఒక్కటే మార్గం.
జాకీ ష్రాఫ్, శ్రుతి హాసన్, అభిషేక్ బచ్చన్, బాబీ డియోల్, ప్రీతి జింటా, ఓప్రా విన్‌ఫ్రే, ప్యారిస్ హిల్టన్, బాబ్ మార్లే, గెలీలియో వంటి ప్రముఖులు కుంభ రాశి వారు.