మకర రాశివారిని ప్రేమలో పడేయాలంటే..!
వీరు ఎవరితోనైనా రిలేషన్ ప్రారంభించే ముందు.. చాలా ఆలోచిస్తారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా.. రిలేషన్ లోకి అడుగుపెట్టరు. మరి.. ఈ రాశివారిని మీ ప్రేమలో పడేయాలంటే.. వారి గురించి మరింత తెలుసుకోవాల్సిందే.

మకర రాశివారు చాలా నమ్మకస్తులు. వీరు చాలా బలమైన వ్యక్తిత్వం గలవారు. ఈ రాశివారు.. తాము రిలేషన్ లో ఎవరితో ఉంటే.. వారి మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. అయితే.. వీరు ఎవరితోనైనా రిలేషన్ ప్రారంభించే ముందు.. చాలా ఆలోచిస్తారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా.. రిలేషన్ లోకి అడుగుపెట్టరు. మరి.. ఈ రాశివారిని మీ ప్రేమలో పడేయాలంటే.. వారి గురించి మరింత తెలుసుకోవాల్సిందే.
మకర రాశివారితో డేటింగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రాశివారు.. కొంచెం డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు అనే విషయాన్ని గుర్తించాలి. క్లోజ్ గా ఉన్నట్లే ఉండి.. కాసేపటికే.. దూరం పెడుతూ ఉంటారు. మీరు ప్రారంభంలో చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు.
మకర రాశివారితో డేటింగ్ కి వెళ్లాలి అనుకుంటే.. వారిని కొత్త ప్రదేశాలకు, రెస్టారెంట్లకు వెళ్లడం కరెక్ట్ కాదు. వారితో డేటింగ్ కి వెళ్లాలి అనుకుంటే.. ఏదైనా మంచి చారిత్రక కట్టడం, ఆసక్తికర నిర్మాణాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ రాశివారికి అలాంటి ప్రదేశాలకు వెళ్లడం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. మీరు వారిని అలాంటి గొప్ప ప్రదేశానికి తీసుకువెళ్లినందుకు వారు ఎక్కువగా ఇష్టపడతారు.
మామూలుగానే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. వీరు డేటింగ్ వెళ్లినప్పుడు.. ఆ మూడ్ స్పాయిల్ కాకూడదని అనుకుంటారు. ఈ రాశివారు.. తమతో డేటింగ్ వచ్చేవారు.. మంచి దుస్తులు ధరించాలని అనుకుంటారు. ఈ రాశివారు లుక్స్ కి ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారు. కాబట్టి.. దుస్తులు సెలక్షన్ కరెక్ట్ గా ఉండాలి.
మకర రాశి వారు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఒక్కోసారి.. వెర్రి వెర్రిగా కూడా ప్రవర్తిస్తారు. వారి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. ఇలానే ఉంటుంది.. అని ఆశించడం కష్టం. ఇక పోతే.. వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. మాటలతోనే రొమాన్స్ పండించగలరు.
ఇక ఈ రాశివారు ఏ విషయంలోనూ.. అంత తొందరగా దేనినీ వదిలిపెట్టరు. రిలేషన్ షిప్ లో మాత్రమే కాదు.. అన్ని విషయాల్లో వీరు అంత త్వరగా దేనినీ వదిలిపెట్టరు. ఒకవైపు ఉద్యోగ జీవితాన్ని.. మరో వైపు కుటుంబ జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేయగలరు. వీరితో లైప్ చాలా బాగుంటుంది.