ఇంట్లో అద్దం ఎక్కడ పెడితే అదృష్టం వరిస్తుంది?
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచడానికి సరైన స్థలాన్ని నిర్ణయిస్తారు. అలాగే వీటిని అనుసరిస్తే మీ ఇంట్లో అంతా బాగుంటుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
మనమందరం మన జీవితంలో శ్రేయస్సు ఉండాలని కోరుకుంటాం. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటాం. అయితే ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంట్లో అద్దాన్ని సరైన ప్రదేశంలో ఉంచితే.. మీ జీవితంలో ఆనందం ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇంట్లో లేదా పనిప్రాంతంలో, పడకగదిలో, వంటగదిలో లేదా మరేదైనా ప్రదేశంలో అద్దం ఉంచినట్టైతే.. దాని వాస్తు నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అద్దాన్ని ఏ దిశలో ఉంచాలి?
ఇంట్లో ఏ రకమైన అద్దమైనా సరే ఉత్తర లేదా తూర్పు గోడలపైనే ఉంచాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం.. అద్దం ఉంచడానికి ఈ దిశను అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఈ దిశలో అద్దాన్ని పెట్టడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అలాగే పొరపాటున కూడా దక్షిణ లేదా పశ్చిమ గోడలపై అద్దాలను ఉంచకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం.. ఈ దిశలో అద్దాన్ని ఉంచకూడదు.
ఇంట్లో అద్దాలను తప్పుగా అమర్చడం వల్ల చాలా నష్టం జరుగుతుందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. ముఖ్యంగా రెండు అద్దాలను ఒకదానికొకటి ముందు ఉంచకూడదు. ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. అలాగే అద్దాలను నేల నుంచి 4 నుంచి 5 అడుగుల ఎత్తులో ఉండేలా చూసుకో
అద్దం ఏయే ప్రదేశాల్లో ఉంచాలి?
మీ ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించాలనుకుంటే.. మీ ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో అద్దాలను పెట్టొచ్చు. ఉదాహరణకు.. మీరు డ్రెస్సింగ్ రూమ్, వాష్రూమ్ తో పాటుగా డైనింగ్ టేబుల్ ముందు డైనింగ్ ప్రాంతంలో ఒక అద్దం ఉంచొచ్చు. ఇలా చేయడం వల్ల ఆహారం తీసుకునేటప్పుడు ఇంట్లోని వారి ప్రతిబింబం కనిపిస్తుందని, ఇది అందరి మధ్య సామరస్యాన్ని కాపాడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం.. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను పెంచుతుంది.
Mirror
కాగా వంటగది లోపల అద్దాలను ఎప్పుడూ కూడా పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా కాకుండా ఇంట్లోని పడకగదిలో ఎప్పుడూ అద్దం పెట్టుకోకూడదు. పడకగదిలో అద్దం పెట్టినా.. మంచం ప్రతిబింబం కనిపించే ప్రదేశంలో ఉంచడం మర్చిపోవద్దు.
ఏ సైజు అద్దాలు శుభప్రదం?
వాస్తు శాస్త్రంలో.. చతురస్రాకార, దీర్ఘచతురస్రాకార అద్దాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇవి శక్తిని సమానంగా వ్యాప్తి చేస్తాయి. దీర్ఘవృత్తాకార, వృత్తాకార అద్దాలు ఉత్తమమైనవిగా పరిగణించబడవు. అందుకే ఇలాంటి వాటిని ఇంట్లో పెట్టకూడదు
ధన లాభం కోసం ఈ ప్రదేశంలో ఒక అద్దాన్నిపెట్టండి
మీ డబ్బు వృధాగా ఖర్చు అవుతున్నట్టైతే, మీరు డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలనుకుంటే, మీ లాకర్ లోపల ఒక అద్దాన్ని పెట్టండి. ఇది మీ సంపదను పెంచుతుంది. ఖర్చులను తగ్గిస్తుంది. అలాగే రుణాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. మీ కిటికీ ఇంటి వెలుపల అందమైన దృశ్యాన్ని చూపిస్తే, ఆ కిటికీ ముందు ఒక అద్దాన్ని ఉంచండి. ఇది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. దీంతో ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.