- Home
- Astrology
- Karthika Purnima: కార్తీక పౌర్ణమి నాడు ఎన్ని దీపాలు పెట్టాలి? బేసి సంఖ్యలోనా లేక సరి సంఖ్యలోనా?
Karthika Purnima: కార్తీక పౌర్ణమి నాడు ఎన్ని దీపాలు పెట్టాలి? బేసి సంఖ్యలోనా లేక సరి సంఖ్యలోనా?
Karthika Purnima: కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. ఆ పౌర్ణమి రోజు దీపం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. విష్ణువు, లక్ష్మీదేవి మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తారు. ఆ రోజు ఎన్ని దీపాలు పెట్టాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

కార్తీక పౌర్ణమి ప్రత్యేకత
ప్రతినెలా ఒక పౌర్ణమి వస్తూనే ఉంటుంది. కానీ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీకమాసంలోని పౌర్ణమిని కార్తీక పూర్ణిమ అని పిలుస్తారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 5 బుధవారం వచ్చింది. ఈ రోజున చేసే పనులు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ఆరోజు దీపదానం చేయడం, ఇతర దానాలు చేయడం, ఉపవాసం ఉండడం అనేవి జీవితంలో వెలుగులు నింపుతాయి. ఆ దేవదేవుడైన మహా శివుడు, విష్ణువు కరుణ మీపై కలుగుతుంది. దేవ దీపావళి, గురునానక్ జయంతి కూడా ఇదే రోజున వచ్చాయి. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు, లక్ష్మీదేవితో కలిసి భూమిని సందర్శిస్తుందని చెబుతారు. అందుకే ఆ రోజున విష్ణువు కరుణాకటాక్షాలు భక్తులపై ఉంటాయని ఎంతోమంది నమ్మకం. ఈరోజు దీప దానం చేయడం వల్ల ఎన్ని పుణ్యాలో తెలుసుకోండి.
ఎన్ని దీపాలు వెలిగించాలి?
కార్తీక పౌర్ణమి నాడు బేసి సంఖ్యలోనే దీపాలను వెలిగించాలి. అంటే 5, 7, 11, 21... ఇలా బేసి సంఖ్యలో ఎన్ని దీపాలనైనా వెలిగించుకోవచ్చు. అయితే 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం ఎంతో శుభప్రదమని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడంలా వల్ల అన్ని పౌర్ణమి రోజుల్లో కూడా దీపాలను పెట్టినంత పుణ్యం వస్తుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు, ఆనందం వంటివి కలుగుతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటకు పోతుంది. దీపాలను వెలిగించడం అనేది పూర్వీకుల ఆత్మలకు శాంతిని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆ రోజు కచ్చితంగా ఇంటి ముందు, ఇంట్లో దీపాలు వెలిగించేందుకు ప్రయత్నించండి.
నదీ స్నానం
కార్తీక పౌర్ణమి నాడు గంగా, యమునా, నర్మదా, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానం చేయాలని అంటారు. దీనివల్ల ఎంతో పవిత్రత వస్తుందని నమ్ముతారు. అలా స్నానం చేశాక దీపాలను పెట్టాలని చెబుతారు. మీకు నదిలో స్నానం చేయడం వీలుకాకపోతే స్నానం చేసే నీటిలో కొంచెం గంగా నది నీటిని కలుపుకున్నా చాలు.. అలాగే మీ ఇంటికి దగ్గరలో లేదా బాల్కనీలో, టెర్రస్ పై ఉన్న తులసి, రావి మొక్కల దగ్గర కూడా దీపాలను కచ్చితంగా పెట్టాలి. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి దీపం పెడితే మంచిది. అలా దీపాలను వెలిగించేటప్పుడు ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాలు జపించాలి.
శుభప్రదమైన సమయం
కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడానికి శుభప్రదమైన సమయం గురించి ఎంతోమంది వెతుకుతూ ఉంటారు. ఈసారి కార్తీక పౌర్ణమినాడు దీపం పెట్టడానికి శుభసమయం సాయంత్రం 5:15 నిమిషాల నుండి 7:50 నిమిషాల వరకు. ఆ మధ్య సమయంలో దీపాలు పెడితే ఎంతో మంచిది. అది పుణ్యకాలంగా చెప్పుకుంటారు.