Digbala Yogam: శక్తివంతమైన దిగ్బల యోగం, ఈ 5 రాశుల వారి జీవితంలో పెను మార్పులు తప్పవు
Digbala Yogam: అతి త్వరలో దిగ్భల యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల 5 రాశుల వారికి మేలు జరగబోతోంది. వారికి అదృష్టం దక్కుతుంది. రాబోయే రోజుల్లో వారి జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ఆ అయిదు రాశులు ఏవో తెలుసుకోండి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి దిగ్భల యోగం ఎంతో మంచి చేస్తుంది. గురు సంచారం, శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి బలమైన యోగాన్ని అందిస్తుంది. ఈ యోగం నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ యోగం వల్ల కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంపద కూడా బాగా పెరుగుతుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఏడో ఇంట్లో బలమైన యోగం ఉంది. వీరికి పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగార్ధులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పొందుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. ఈ రాశి వారికున్న వ్యక్తిగత సమస్యలు తీరిపోతాయి. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో బుధుడి సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం చేసినా సఫలమవుతుంది. వీరికి ఆదాయ, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు కలుగుతాయి. వీరికున్న అనారోగ్యం, శత్రు బాధలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
మకర రాశి
మకర రాశికి పదో ఇంట్లో రవి సంచారం వల్ల జరుగుతుంది. వీరికి దిగ్బల యోగం ఏర్పడుతుంది. ఇది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికార యోగం దక్కుతుంది. వ్యక్తిగత సమస్యలన్నీ తీరిపోతాయి. వీరికి షేర్లు, ఆర్థిక లావాదేవీలు కలిసివస్తాయి.
కుంభ రాశి
కుంభ రాశికి పదో ఇంట్లో కుజ సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగాల్లో అభివృద్ధి అధికంగా కనిపిస్తుంది. వీరికి అధికార యోగం పొందవచ్చు. ఉద్యోగం మారేందుకు ఇది అనుకూల సమయం అనే చెప్పాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు భారీగా వస్తాయి.