అలాంటి సమయంలో... ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?
అన్నీ మనకు సవ్యంగా.. మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. మనకు నచ్చని రోజులు కూడా వస్తూనే ఉంటాయి. అలాంటి రోజు ఎదురైనప్పుడు ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం..

ప్రతిరోజూ మనకు నచ్చినట్లుగానే ఉండదు. అన్నీ మనకు సవ్యంగా.. మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. మనకు నచ్చని రోజులు కూడా వస్తూనే ఉంటాయి. అలాంటి రోజు ఎదురైనప్పుడు ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
ఏదైనా నచ్చని రోజు ఎదురైతే.. ఈ రాశివారికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అందరిమీద గట్టి గట్టిగా.. గొంతేసుకొని అరుస్తూ ఉంటారు. ఎంత గట్టిగా మాట్లాడుతున్నాం అనే విషయం కూడా ఆలోచించకుండా అరిచేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎవరు ఉన్నారు..? ఎవరి మీద మనం అరుస్తున్నాం అనేది కూడా వీరు చూడరు.
2.వృషభ రాశి..
ఈ రాశివారు ఏదైనా చెడు రోజు ఎదురైతే.. తమకు అలా జరగడానికి గల కారకులపై విమర్శలు చేస్తారు. అయితే.. బటయకు చెప్పలేరు. నోట్లో నోట్లోనే గొణుక్కుంటూ.. వారిని తిట్టుకుంటూ ఉంటారు.
3.మిథున రాశి..
ఏదైనా చెడు రోజు.. అనుకూలంగా లేని రోజు ఎదురైనప్పుడు.. మిథున రాశివారు చాలా సైలెంట్ గా ఉంటారు. ఎవరైనా తమపై కామెంట్స్ చేయాలని చూసినా... ఏం చేసినా కూడా వీరు చాలా సైలెంట్ గా ఉండిపోతారు.
4.కర్కాటక రాశి..
ఏదైనా చెడు రోజు ఎదురైనప్పుడు.. తాము అనుకున్నట్లుగా జరగనప్పుడు ఈ రాశివారు ఒకటే మాట్లాడుతూ ఉంటారు. ఎవరి కారణంగా అయితే.. మీకు చెడు జరిగిందో.. వారికి అర్థమయ్యేలా.. వారికి వినపడేలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.
5.సింహ రాశి..
ఏదైనా చెడు జరిగినప్పుడు ఈ రాశివారిలో కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోతుంది. వెంటనే.. ఇంట్లో అద్దం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు ఏదైనా తమకు ఊహించని చెడు జరిగినప్పుడు.. గట్టిగా.. పిచ్చి పట్టినట్లుగా నవ్వుతూ ఉంటారు. తమ ఎదురుగా ఉన్నవారిని ఇటుకతో కొట్టాలి అని కోపంగా ఉంటారు. కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు.
7. తుల రాశి..
ఈ రాశివారు తమకు ఏదైనా ఊహించని చెడు జరిగినప్పుడు..... తమకు అలా జరగడానికి కారణమైన వారిపై వ్యంగ్యంగా మాట్లాడతారు. తమకు చెడు చేసిన వారికి మాటలతో గట్టి కౌంటర్ ఇచ్చేస్తూ ఉంటారు.
8. వృశ్చిక రాశి..
ఈ రాశివారు తమకు ఏదైనా ఊహించని చెడు జరిగినప్పుడు.. అందరిని తిట్టేస్తారు. ముఖ్యంగా తమకు అలా జరగడానికి కారణమైన వారిని తిట్టడంతో పాటు... వారిపై దాడి కూడా చేస్తారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు తమకు ఏదైనా చెడు జరిగినప్పుడు.. పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎవరినో ఒకరిని చంపేద్దామా అన్న కోపంతో ఊగిపోతూ ఉంటారు.
10.మకర రాశి..
ఈ రాశివారు తమకు ఊహించని చెడు జరిగినప్పుు.. తమ వాళ్లందరినీ అలర్ట్ చేస్తూ ఉంటారు. మరోసారి అలాంటిది జరగకుండా ఉండేలా జాగ్రత్త పడతారు.
11.కుంభ రాశి..
ఈ రాశివారు ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి కోలుకోవడానికి ఏదైనా చేస్తారు. మద్యం అలవాటు ఉన్నవారు.. ఉదయం నుంచే దానిని తీసుకోవడం మొదలుపెడతారు. కాని వాళ్లు.. ఏదైనా స్వీట్స, షుగర్ లాంటివి విపరీతంగా తినేస్తూ ఉంటారు.
12.మీన రాశి..
ఈ రాశివారు వెంటనే బాధపడిపోతారు. ఒక్కరే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో గదిలో బంధించుకొని... ఒక్కరే కూర్చొని బాధపడుతూ ఉంటారు.