Dhana trayodashi 2025: ధన త్రయోదశి నాడు చీపురు కొని పూజిస్తే ఎంత మంచిదో తెలుసా
ధన త్రయోదశి (Dhana trayodashi 2025) హిందూ పండగలలో ముఖ్యమైనది. ఆ రోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని, ధన్వంతరిని పూజిస్తారు. ధంతేరాస్ నాడు చీపురు కొనడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది.

ధన త్రయోదశి 2025
ధన త్రయోదశి పేరు చెపితే బంగారం, వెండి, ఇత్తడి పాత్రలు కొనడమే గుర్తొస్తుంది. కొంతమంది కార్లు, భూమి, ఇల్లు వంటివి కూడా కొంటూ ఉంటారు. ఆరోజు కొనే వస్తువులు ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తాయి. ధన త్రయోదశి నాడు కొత్త చీపురును కొనడం కూడా సాంప్రదాయం. మీరు ఇలా కొత్త చీపురును కొనడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
చీపురు.. లక్ష్మీదేవి
ధన త్రయోదశి నాడు మీరు చీపురుని కొని దాన్ని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మత్స్య పురాణం చెబుతున్న ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. హిందూ మత గ్రంథాలు కూడా చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావించాలని చెబుతాయి. ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది.
ఎన్ని చీపుళ్లు కొనాలి?
ధన త్రయోదశి నాడు కొత్త చీపురు కొని.. ఆ చీపురును పూలు, బియ్యం గింజలతో పూజించాలి. ఆ తర్వాత దాన్ని ఉపయోగించాలి. ఒక చీపురు కొనవచ్చు లేదా మూడు, ఐదు, ఏడు ఇలా బేసి సంఖ్యలోనే చీపుళ్లను ఎప్పుడైనా కొనాలని గుర్తు పెట్టుకోండి. రెండు, నాలుగు ఇలా సరి సంఖ్యలో చీపుళ్లను కొనకూడదు.
చీపురు ఎక్కడ పెట్టాలి?
చీపురును ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. దాన్ని ఎల్లప్పుడూ బయట వారికి కనిపించకుండా ఉండే ప్రదేశాల్లోనే ఉంచాలి. చీపురుపై కాలు వేసి ఎప్పుడూ తొక్క కూడదు. అనుకోకుండా మీరు అలా చేసి ఉంటే వెంటనే చీపురును తాకి క్షమించమని కోరాలి. సంపదను పెంచుకోవాలనేవారు ధన త్రయోదశి నాడు కొత్త చీపురును కొనడం మర్చిపోవద్దు. కొత్త చీపురును కొని దీపావళి నాడు సూర్యాస్తమయానికి ముందు ఏదైనా దగ్గరలోని ఆలయానికి వెళ్లి దానం చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీకు సంపాదన ప్రసాదిస్తుందని అంటారు.