MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Astrology: ఇంట్లో బల్లులు పదే పదే శబ్ధం చేస్తూ తిరుగుతున్నాయా? దాని అర్థం ఇదే!

Astrology: ఇంట్లో బల్లులు పదే పదే శబ్ధం చేస్తూ తిరుగుతున్నాయా? దాని అర్థం ఇదే!

సాధారణంగా అందరి ఇళ్లల్లో బల్లులు ఉంటాయి. అవి అప్పుడప్పుడు శబ్ధం చేస్తుంటాయి. అటు, ఇటూ పరిగెడుతూ ఉంటాయి. అయితే ఈ చర్యలకు కొన్ని అర్థాలు, ఫలితాలు, కారణాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి అవేంటో తెలుసుకుందామా..  

2 Min read
Author : Kavitha G
Published : Jul 02 2025, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాస్తు శాస్త్రం ప్రకారం..
Image Credit : stockPhoto

వాస్తు శాస్త్రం ప్రకారం..

హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తు ప్రకారం నడుచుకుంటే అంతా మంచే జరుగుతుందని చాలామంది నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. బల్లులను లక్ష్మీదేవి అంశంగా లేదా సందేశాన్ని తెచ్చే దూతగా భావిస్తారు. అయితే కొన్నిసార్లు వాటిని రాబోయే సమస్యకు సంకేతంగా కూడా చూడవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంట్లో ఎక్కువ బల్లులు ఉంటే...
Image Credit : stockPhoto

ఇంట్లో ఎక్కువ బల్లులు ఉంటే...

కొన్ని నమ్మకాల ప్రకారం.. ఇంట్లో బల్లులను చూడటం సంపద, శ్రేయస్సును సూచిస్తుంది. ముఖ్యంగా.. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ బల్లులను చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు.

బల్లి శబ్దం చేయడం కూడా శుభవార్తకు సంకేతమని భావిస్తారు. బల్లి కొన్ని అసాధారణ చర్యలు చేయడాన్ని (ఉదాహరణకు.. వేగంగా పరుగెత్తడం, లేదా గోడ నుంచి పడటం) హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు.

Related Articles

Related image1
July Born Personality Traits: జూలై నెలలో పుట్టినవారి ప్రత్యేకతలేంటో తెలుసా?
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి స్వార్థం ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!
35
బల్లి మీదపడితే దాని అర్థం ఏంటి?
Image Credit : stockPhoto

బల్లి మీదపడితే దాని అర్థం ఏంటి?

బల్లి ఏ శరీర భాగంలో పడుతుందో దాని ఆధారంగా అనేక అర్థాలను కలిగి ఉంటుంది. దీన్ని ఒక శకునంగా పరిగణిస్తారు.

తల: తలపై బల్లి పడటం భవిష్యత్తులో గొడవ లేదా తగాదాను సూచిస్తుంది. దీన్ని చెడు శకునంగా పరిగణిస్తారు.

ముఖం: ముఖంపై బల్లి పడటం ఊహించని అదృష్టం లేదా కొత్త అవకాశాలను సూచిస్తుంది.

కుడి చేయి/భుజం: ఇది మంచి శకునం. రాబోయే విజయం, సంపద లేదా కొత్త ఉద్యోగాన్ని సూచిస్తుంది.

ఎడమ చేయి/భుజం: ఇది చెడు శకునం. రాబోయే సమస్యలు, నష్టం లేదా అనారోగ్యాన్ని సూచిస్తుంది.

ఛాతీ: ఛాతీపై పడటం ఆర్థిక లాభాలను సూచిస్తుంది.

కడుపు: కడుపుపై పడటం చిన్న సమస్యను సూచిస్తుంది. 

కాళ్లు: కాళ్లపై పడటం ఒక ప్రయాణాన్ని లేదా కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.

45
బల్లి శబ్ధం.. దేన్ని సూచిస్తుంది?
Image Credit : stockPhoto

బల్లి శబ్ధం.. దేన్ని సూచిస్తుంది?

శుభవార్త: కొన్నిసార్లు, బల్లి శబ్ధం శుభవార్త రాబోతుందని సూచిస్తుంది. ముఖ్యంగా ఉదయం వేళ మీరు శబ్ధం విన్నట్లయితే అది శుభప్రదం.

అతిథులు: బల్లి శబ్ధం అతిథుల రాకను కూడా సూచిస్తుంది.

ప్రమాదం: కొన్నిసార్లు బల్లి అసాధారణంగా శబ్దం చేస్తే.. ప్రమాదం లేదా సమస్య వస్తుందని అర్థం.

లక్ష్మీ కటాక్షం: పూజ గదిలో లేదా డబ్బు పెట్టె దగ్గర బల్లి శబ్ధం చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహాం దక్కుతుందని నమ్మకం.

55
బల్లి వచ్చే దిశను బట్టి...
Image Credit : stockPhoto

బల్లి వచ్చే దిశను బట్టి...

ఉత్తర దిశ: ఉత్తరం నుంచి బల్లి రావడం ఆర్థిక లాభాలను సూచిస్తుంది.

తూర్పు దిశ: తూర్పు నుంచి రావడం కొత్త అవకాశం లేదా శుభవార్తను సూచిస్తుంది.

దక్షిణ దిశ: దక్షిణం నుంచి రావడం చిన్న సమస్యను లేదా పాత స్నేహితుడి రాకను సూచిస్తుంది.

పడమర దిశ: బల్లి పడమర నుంచి రావడం ప్రయాణం లేదా ముఖ్యమైన సమావేశాన్ని సూచిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
July Born Personality Traits: జూలై నెలలో పుట్టినవారి ప్రత్యేకతలేంటో తెలుసా?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి స్వార్థం ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved