MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Horoscope: జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే ఏమౌతుంది?

Horoscope: జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే ఏమౌతుంది?

జాతకాలు చూసుకోకుండా, లేదా కలవకుండా పెళ్లి చేసుకుంటే ఏమౌతుంది? ఆ జంట విడిపోతుందా ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2025, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


జాతకం మన పుట్టిన సమయాన్ని ఆధారం చేసుకొని రాస్తారు. ఆ జాతకం ప్రకారం మన వ్యక్తిత్వం, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతూ ఉంటారు.అయితే, చాలా మంది జాతకాలను బాగా నమ్ముతారు. ఎంతలా అంటే.. జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే..వేరే ఏ ఉద్యగం వచ్చినా కూడా వదిలేసుకునేవారు కూడా ఉన్నారు. ఇక పెళ్లి విషయంలో అయితే చెప్పే అవసరం లేదు. జాతకాలు చూడకుండా చాలా మంది పెళ్లిళ్లు చేసుకోరు.కానీ, జాతకాలు చూసుకోకుండా, లేదా కలవకుండా పెళ్లి చేసుకుంటే ఏమౌతుంది? ఆ జంట విడిపోతుందా ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పెళ్లికి జాతకం ఎందుకు కలవాలి?
ఇప్పుడంటే.. పిల్లలు ఏరోజు ఏ సమయంలో పుట్టారు అనే విషయం అందరికీ తెలుస్తోంది. దీనిని బట్టి జాతకం కూడా ఈజీగా రాయించగలం.కానీ పూర్వం అలా ఉండేది కాదు. అందరికీ జాతకాలు రాయించే అలవాటు ఉండేది కాదు. దాని వల్ల జాతకాలు సరిపోయాయా లేదా అనే సందేహం ఉండేది కొన్ని సార్లు పురుషుడి జాతకం మాత్రమే ఉండి.. స్త్రీకి ఉండేది కాదు. మరికొన్నిసార్లు స్త్రీకి ఉంటే, పురుషులకు ఉండదు. అటువంటి సమయంలో పెళ్లిళ్లు చేసుకొని వారి మధ్య ఏదైనా తేడాలు వచ్చినా  జాతకం కలవకపోవడం వల్లే ఇలా జరిగింది అనేవాళ్లు.

34

జాతకాలు కలవకపోయినా ఇవి కలవాల్సిందే..

జాతకం చూడకుండా పెళ్లి చేసుకోవాలంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

ఇద్దరి కుటుంబాల వాతావరణం, వారి ఆలోచనా సరళి, జీవన విధానం సమానంగా ఉన్నాయా? అని చూసుకోవాలి. లేకపోతే, వైవాహిక జీవితం సాఫల్యవంతంగా కొనసాగడం కష్టమవుతుంది.సమస్యలు, కష్టాలు వస్తాయి.

జ్ఞానం, ఆలోచనా విధానం, ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే తీరు ఒకేలా ఉన్నాయా? ఒకరు ఆర్థికంగా బాధ్యతగా ఉంటే, మరొకరు నిర్లక్ష్యంగా ఉంటే, అనర్థాలు తప్పవు. ఈ విషయాల్లో ఇద్దరి మధ్య తేడాలు లేకుండా చూసుకోవాలి. ఇద్దరి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లికి సిద్ధం కావాలి.

భావోద్వేగాలను ఒకరినొకరు అర్థం చేసుకోగలరా? కొందరు ప్రేమ వివాహం చేసుకున్నా, కొద్ది కాలంలోనే విడిపోతుంటారు. ఇది వారి మానసిక అనుకూలత లేకపోవడమే కారణం.

కొంతమంది సహజంగా కోపంగా ఉంటారు, మరికొందరు శాంతస్వభావులుగా ఉంటారు. కానీ నిజమైన వ్యక్తిత్వం వాటిని మించినది. ఒకరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి.


ఆరోగ్యపరంగా జీవనశైలి ఎలా ఉంది? దీర్ఘకాలిక అనారోగ్యం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

ఈ ఐదు అనుకూలతలు ఉన్నట్లయితే, జాతకం చూడకుండానే మీరు వివాహ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతక పరిశీలన ఇంకా అవసరమే.
 

44

జాతకం అవసరమా లేదా?

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, భార్య లేదా భర్త అనుకోని విధంగా విడిపోయే పరిస్థితి లేదా ఎవరైనా అకాల మరణానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్రమాదాలను నివారించడానికి జాతకాన్ని పరిశీలించడం మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. పురాతన కాలంలో జాతకాలు లేకపోయినా, పై పేర్కొన్న ఐదు అనుకూలతలను అనుసరించి వివాహాలు చేసుకునే వారు సుఖంగా జీవించేవారు. కానీ నేటి కాలంలో, మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు జాతక పరిశీలన అవసరమని భావిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
బంధుత్వం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved