12ఏళ్ల తర్వాత... ఈ రాశులవారికి మహర్దశ మొదలైంది..!
గురు గ్రహం వృషభంలోకి అడుగుపెట్టడం వల్ల... ఐదు రాశులవారికి మంచి జరగనుంది. మంచి అంటే మామూలు మంచి కాదు.. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.
పుష్కరకాలం తర్వాత... అంటే దాదాప 12ఏళ్ల తర్వాత.... ఐదు రాశులవారికి మహర్దశ మొదలైంది. గురు గ్రహం మే1వ తేదీన మేష రాశి నుంచి వృషభ రాశిలోకి అడుగుపెట్టాడు. దాదాపు సంవత్సరం పాటు అంటే వచ్చే ఏడాది మే 14 వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. అయితే... గురు గ్రహం వృషభంలోకి అడుగుపెట్టడం వల్ల... ఐదు రాశులవారికి మంచి జరగనుంది. మంచి అంటే మామూలు మంచి కాదు.. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తౌతాయి. ఆ ఐదు రాశులేంటి..? వారికి కలిగే ప్రయోజనాలేంటతి..? ఇతర రాశుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం...
12ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అద్భుతం కారణంగా మేష రాశి, వృషభ రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి ఈ ఐదు రాశులకు ఈ ఏడాది తిరుగులేదనే చెప్పాలి. వీరితో పాటు కన్య రాశి, కర్కాటక రాశి, మకర రాశి, మీన రాశివారికి కూడా బాగానే ఉంటుంది. కానీ... పైన చెప్పిన ఐదు రాశులవారికి మాత్రం ఊహించని లాభాలు అందనున్నాయి.
telugu astrology
1.మేష రాశి..
మేష రాశివారికి ఈ ఏడాది... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు ఉన్నా కూడా పోతాయి. ఈ ఏడాది అంతా వారు దాదాపు చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఏడాది తర్వాత... మళ్లీ సమస్యలు ఏమైనా వస్తే వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ రాశివారు ఎంత ఎక్కువ కష్టపడితే వారికి ఈ ఏడాది అంత మేలు జరుగుతుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా చెయ్యి జార్చకూడదు.
telugu astrology
2.వృషభ రాశి..
ఇక ఈ ఏడాది వృషభ రాశివారికి కూడా చాలా దివ్యంగా ఉందని చెప్పాలి. ఊహించని మార్గాల నుంచి వీరికి డబ్బులు కుప్పలు గా వచ్చి పడే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో ఏమైనా గొడవలు రావచ్చు. కానీ.. ప్రేమ జీవితం మళ్లీ మధురంగానే మారుతుంది.
telugu astrology
3. సింహ రాశి..
సింహ రాశివారికి కూడా ఈ ఏడాది దివ్యంగా ఉండబోతోంది. ఈ ఏడాది వీరికి వృత్తి పరంగా, ఆర్థికంగా పట్టిందల్లా బంగారం కానుంది. వారు కోరుకున్న అవకాశాలు వాళ్ల కాళ్ల ముందుకే వస్తాయి. గుర్తింపు పెరుగుతుంది. ఆర్థికంగా నిలపడగలుగుతారు. సింగిల్ గా ఉన్నవారి జీవితంలో ప్రేమ కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఏడాది చివరల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
telugu astrology
4.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి ఈ ఏడాది వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఊహించని పెట్టుబడులు ఈ రాశివారికి ఈ ఏడాది వచ్చే అవకాశం ఉంది. వారు తీసుకునే నిర్ణయాలే వారి జీవితాన్ని మార్చేస్తాయి. తోడబుట్టిన వారితో బంధం మరింత మెరుగుపడుతుంది. భాగస్వామి కూడా ఆర్థికంగా ఈ రాశివారికి ఈ ఏడాది సహకరిస్తారు. వ్యాపారాల్లో తిరుగులేని లాభాలు చూస్తారు.
telugu astrology
5.కుంభ రాశి...
కుంభ రాశివారికి కూడా ఈ ఏడాది చాలా దివ్యంగా ఉండనుంది. వృషభ రాశివారితో సమానంగా ఈ ఏడాది కుంభ రాశివారికి ఆర్థిక లాభాలు చూస్తారు. నిత్యవసర వస్తువులు, ఇంటరీయర్ డిజైన్ లాంటి వాటిలో ఈ రాశివారు పెట్టుబడులు పెట్టడం వల్ల... వారికి చాలా మేలు జరుగుతుంది.ఈ రాశివారు ఈ ఏడాది పని, డబ్బు , ఆరోగ్యం ఈ మూడింటినీ సరిగా మేనేజ్ చేసుకుంటే... దివ్యమైన ఫలితాలు చూస్తారు.