MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • గురు, చంద్రుల అద్భుత యోగం.. ఈ 6 రాశులవారి దశ తిరిగినట్లే!

గురు, చంద్రుల అద్భుత యోగం.. ఈ 6 రాశులవారి దశ తిరిగినట్లే!

జ్యోతిష్యం ప్రకారం నవంబర్ నెల అత్యంత శుభప్రదమైనది. ఈ నెల 2, 3, 4 తేదీలలో గురు, చంద్ర గ్రహాలు ఒకే రాశిలో సంచరించనున్నాయి. ఈ గ్రహాల కలయికతో మనసుకు శాంతి, ఆర్థికాభివృద్ధి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 6 రాశుల వారి జీవితం ప్రకాశించనుంది. 

2 Min read
Author : Kavitha G
Published : Oct 31 2025, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

వృషభ రాశివారికి గురు-చంద్ర సంచారం ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది. డబ్బులు తిరిగి రావడం, అప్పులు తీరడం వంటి శుభఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఇది విజయం సాధించే సమయం. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రశంసలు దక్కుతాయి. చిన్న ప్రయత్నంతో పెద్ద విజయాలు సాధిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథున రాశివారికి గురు-చంద్ర యోగం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం లేదా కళా రంగంలో ఉన్నవారికి విజయాలు దక్కుతాయి. స్నేహితుల సహకారం, కొత్త పరిచయాలు అదృష్టాన్ని తెస్తాయి. కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చే అవకాశం ఉంది. ధ్యానం, పూజలకు ఈ సమయం చాలా అనుకూలం.  

Related Articles

Related image1
ఈ 4 రాశుల వారికి కోపం చాలా ఎక్కువ.. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు!
Related image2
ఈ 4 రాశులవారు నక్కతోక తొక్కినట్లే.. నవంబర్ లో విదేశాలకు వెళ్లడం ఖాయం!
36
కర్కాటక రాశి
Image Credit : AI

కర్కాటక రాశి

చంద్రుడు కర్కాటక రాశి అధిపతి కావడం వల్ల ఈ యోగం ఈ రాశివారికి విశేష ఫలితాలను ఇస్తుంది. భావోద్వేగ పరంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని పాత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా సాగుతాయి. 

46
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశివారికి గురు-చంద్ర యోగం వృత్తి, ఆర్థిక రంగాల్లో కొత్త ద్వారాలను తెరిచే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ లభించవచ్చు. కొత్త సంబంధాలు, ఒప్పందాలు అనుకూలంగా సాగుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషకర మార్పులు చోటు చేసుకుంటాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా లాభాలు వస్తాయి. 

56
ధనుస్సు రాశి
Image Credit : our own

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి అధిపతి గురువు. కాబట్టి గురు, చంద్ర యోగం ధనుస్సు రాశివారికి అసాధారణ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకూల గ్రహ స్థితి కారణంగా ఆదాయ వృద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. 

66
మీన రాశి
Image Credit : AI Generated

మీన రాశి

గురు, చంద్రుల సంచారం వల్ల మీనరాశి వారికి మేలు జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం చేసినా విజయం లభిస్తుంది. సొంత ఇల్లు, విదేశీ ఉద్యోగ కల నెరవేరుతుంది. సంతానం కలుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే
Recommended image3
Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది
Related Stories
Recommended image1
ఈ 4 రాశుల వారికి కోపం చాలా ఎక్కువ.. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు!
Recommended image2
ఈ 4 రాశులవారు నక్కతోక తొక్కినట్లే.. నవంబర్ లో విదేశాలకు వెళ్లడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved